రూ.100 డ్రెస్ వేసుకున్న హీరో.. ఆర్థిక ఇబ్బందులు తాళలేక..

by S Gopi |
రూ.100 డ్రెస్ వేసుకున్న హీరో.. ఆర్థిక ఇబ్బందులు తాళలేక..
X

దిశ, సినిమా: బాలీవుడ్ హీరో రాజ్‌ కుమార్‌ రావు తన కుటుంబం ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందుల గురించి ఓపెన్ అయ్యాడు. ఆయన నటించిన చిత్రం 'హిట్‌: ది ఫస్ట్‌ కేస్‌' జూలై 15న విడుదలై హిట్ టాక్ సొంతం చేసుకోగా.. ఓ ఇంటర్వ్యూలో సాధారణ ఫ్యామిలీ నుంచి వచ్చిన తనకు ఇండస్ట్రీలో కూడా పెద్దగా సపోర్ట్ దొరకలేదని, ఒకవైపు ఇంట్లో ఇబ్బందులు, మరోవైపు కెరీర్ స్ట్రగుల్స్ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ ఈ స్థాయికి చేరుకున్నట్లు తెలిపాడు. 'పదో తరగతి పూర్తయిన తర్వాత ఫేర్‌వెల్‌ పార్టీ జరిగింది. ఆ పార్టీకి అదిరిపోయే డ్రెస్‌తో వెళ్లాలని ఉండేది. ఎందుకంటే ఫ్రెండ్స్‌తో కలిసి నేను స్టేజ్ మీద డ్యాన్స్ చేయాలి. కానీ, అప్పటికే మా కుటుంబం ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటుంది. దీంతో ఢిల్లీలోని చోర్‌ బజార్‌కు వెళ్లి రూ. 100 పెట్టి ఓ జాకెట్‌, రూ. 15తో మెడలో చైన్‌ కొనుక్కుని ఆ కార్యక్రమానికి వెళ్లాను' అంటూ తన గతాన్ని గుర్తుచేసుకున్నాడు.

Advertisement

Next Story

Most Viewed