- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Telangana News: ఇళ్లపై నల్లజెండా ఎగరేయకుంటే రైతుబంధు కట్!
దిశ, డైనమిక్ బ్యూరో : ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు బ్లేమ్ గేమ్ ఆడుతున్నాయని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో యాసంగి ధాన్యాన్ని పంజాబ్ తరహాలో కొనుగోలు చేయాలన్న డిమాండ్‌తో టీఆర్ఎస్ నేతలు రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు, నల్లజెండాలు ఎగురవేయడం, బైక్ ర్యాలీలు నిర్వహించారు. ఈక్రమంలో దీనిపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. రైతులు తమ ఇళ్ల పై నల్లజెండా ఎగురవేయకపోతే రైతుబంధు ఇవ్వబోమని ఓ మంత్రి ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. అంతేగాకుండా, నేను రైతునే అని జబ్బలు చరుచుకునే కేసీఆర్ నివాసం ఉండే ప్రగతి భవన్, ఫాంహౌస్‌ల పై నల్ల జెండా ఎందుకు ఎగరేయలేదు? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
ధాన్యం కొనుగోళ్ల పై బీజేపీ - టీఆర్ఎస్ ది బ్లేమ్ గేమ్.
— Revanth Reddy (@revanth_anumula) April 8, 2022
రైతులు తమ ఇళ్ల పై నల్లజెండా ఎగురవేయకపోతే రైతుబంధు ఇవ్వబోమని ఓ మంత్రి ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారు.
నేను రైతునే అని జబ్బలు చరుచుకునే కేసీఆర్ ఆయన నివాసం ఉండే ప్రగతి భవన్, ఫాంహౌస్ ల పై నల్ల జెండా ఎందుకు ఎగరేయలేదు?