రాహుల్ గాంధీ ఎవరనేది సందేహాత్మకమే: సీఎం యోగీ

by Disha Desk |
రాహుల్ గాంధీ ఎవరనేది సందేహాత్మకమే: సీఎం యోగీ
X

డెహ్రడూన్: ఉత్తరప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన గుర్తింపుపై అనుమానంగా ఉందని అన్నారు. గతంలో ఆయన తాత యాదృఛ్చిక హిందువుగా చెప్పుకున్నట్లు గుర్తుచేశారు. శనివారం ఉత్తరాఖండ్ కోటద్వార్‌లో ఎన్నికల ర్యాలీలో ఆయన ప్రసంగించారు. 'తన గుర్తింపుపై సందేహం ఉన్న వ్యక్తే హిందూయిజం గురించి వివరణ ఇస్తున్నారు. రాహుల్ గాంధీ హిందూయిజంపై మాట్లాడటంపై నాకు ఆశ్చర్యం వేసింది. ఆయన తాత యాధృచ్చిక హిందువునని చెప్పుకున్నారు. పూర్వీకులు హిందువులమని గర్వించని వారు హిందూయిజం గురించి మనకు చెప్పడం సరికాదు. వారు తమ కోసం సృష్టించుకున్న గుర్తింపును ఉత్తరాఖండ్‌లో అనుమతించొద్దు' అని అన్నారు. హిందూ అనేది మతపరమైన పదం కాదని, సాంస్కృతిక గుర్తింపు అని చెప్పారు. దేవభూమిలో హిందూ అర్థం తెలియకపోతే, వారికి అధికారంలో వచ్చే హక్కు లేదని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ పని పూర్తయిందని ఆరోపించారు. ఇంకా ఏమైనా మిగిలి ఉంటే రాహుల్, ప్రియాంక గాంధీలు నాశనం చేస్తారని విమర్శించారు. యూపీ నలుగురు కుటుంబసభ్యులను పార్లమెంటుకు పంపిందని అన్నారు. అయితే కేరళకు వెళ్లిన వారు రాష్ట్రాన్ని తక్కువ చూశారని చెప్పారు. 'ఒకవేళ వారు దేశం దాటి వెళ్తే, భారత్ వైపు వేలెత్తి చూపిస్తారు' అని అన్నారు.



Advertisement

Next Story

Most Viewed