52 ఏళ్లుగా ఆ కార్యాలయంపై ఎగరని జాతీయ జెండా

by sudharani |   ( Updated:2022-08-04 10:12:50.0  )
52 ఏళ్లుగా ఆ కార్యాలయంపై ఎగరని జాతీయ జెండా
X

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ ఆర్ఎస్ఎస్‌ను టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. 52 ఏళ్లుగా ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంపై జాతీయ జెండా ఎగరవేయలేదని, దీనికి గల కారణాన్ని వెల్లడించాలని గురువారం ఆయన ప్రశ్నించారు. 'హర్ ఘర్ తిరంగా' ప్రచార కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ నేతలు తమ సోషల్ మీడియా అకౌంట్ల డీపీలు మార్చారు. ఈ క్రమంలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కూడా నెహ్రూ జాతీయ జెండాను పట్టుకున్న ఫోటోను డీపీగా పెట్టుకున్నారు. అయితే బుధవారం సంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఎర్రకోట నుంచి పార్లమెంట్ వరకు బైక్ ర్యాలీ కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ ఎంపీలు గైర్హజరు అయ్యారు. దీంతో ఈ వార్త తీవ్ర దుమారం రేపింది. దేశ స్వాతంత్ర్యం కోసం లక్షల మంది ప్రాణాలు బలయ్యాయి. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకోవాలని బీజేపీ పిలుపునిస్తోంది. అయితే ఆర్ఆర్ఎస్ ఎప్పుడూ త్రివర్ణ పతకాన్ని ఎగురవేయడం చూడలేదని రాహుల్ గాంధీ ఆరోపించారు. 52 ఏళ్లు దాటినా ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంలో జాతీయ జెండాను ఎందుకు ఎగురవేయలేదని ఆయన ప్రశ్నించారు. చైనా నుంచి జాతీయ జెండాలను దిగుమతి చేసుకుని శ్రామికుల పొట్ట కొడుతున్నారని రాహుల్ గాంధీ మండిపడ్డారు.

Advertisement

Next Story

Most Viewed