కొత్త ఉక్రెయిన్ యుద్ధ కమాండర్‌ని నియమించిన పుతిన్.. మారణహోమం తప్పదన్న అమెరికా

by Mahesh |
కొత్త ఉక్రెయిన్ యుద్ధ కమాండర్‌ని నియమించిన పుతిన్.. మారణహోమం తప్పదన్న అమెరికా
X

దిశ, వెబ్ డెస్క్: చిన్న దేశమైన ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించిన రష్యాకు ఇప్పుడాదేశం కొరకరాని కొయ్య లా మారి పోయినట్లుంది. దాదాపు రెండు నెలలుగా సాగుతున్న యుద్ధంలో ఎనిమిదిమంది రష్యన్ సీనియర్ కమాండర్లు ప్రాణాలు కోల్పోయారు. 19,000కు పైగా రష్యా సైనికులు మరణించారని వార్తలు. 450 పైగా అత్యున్నత యుద్ధ సామగ్రిని కోల్పోయినట్లు సమాచారం. దీంతో ఉగ్రుడైన రష్యా అధ్యక్షుడు పుతిన్ 9వ కమాండర్‌గా పాశవికుడిగా పేరొందిన జనరల్ అలెగ్జాండర్ డ్వొర్నికోవ్‌ని తాజాగా నియమించారు. ఇతడికి సిరియాలో పౌరులపై దారుణ కృత్యాలకు పాల్పడిన చరిత్ర ఉందని అమెరికా అధికారులు ప్రకటిస్తున్నారు.

జనరల్ అలెగ్జాండర్ డ్వొర్నికోవ్ రష్యాకు చెందిన అత్యంత అనుభవజ్ఞులైన సైనిక అధికారుల్లో ఒకరు. ఉక్రెయిన్ పౌరులపై పాశవిక దాడులు సల్పడానికి, ఘోర నేర చర్యలు పాల్పడటానికి పుతిన్ ఏరికోరి ఇతడిని ఉక్రెయిన్ యుద్ధరంగంలో నియమించారని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సుల్లివాన్ పేర్కొన్నారు.

కాగా, ఉక్రెయిన్ రాజధానిని వశపరచుకోవడంలో మాస్కో నియమించిన రష్యన్ బలగాలు విఫలమైన నేపథ్యంలో రష్యా సదరన్ మిలిటరీ జిల్లా కమాండర్ జనరల్ అలెగ్జాండర్ డ్వొర్నికోవ్‌ను రష్యా అధ్యక్షుడు ఏరికోరి నియమించడం భయాందోళనలకు కారణమవుతోంది. మే 9న విక్టరీ డే నాటికి పుతిన్‌కి యుద్ధరంగం నుంచి శుభవార్త ఇవ్వడానికి రష్యా బలగాలు సిద్ధమవుతున్నాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఉక్రెయిన్‌లో మరిన్ని దౌర్జన్యాలు, దాడులు పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed