- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పూరి డ్రీమ్ ప్రాజెక్ట్‌కు మరో చిక్కు.. అది మార్చాల్సిందేనా..??
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ 'జన గణ మన'కు మరో చిక్కు ఎదురైంది. ఈ సినిమాను పూరి ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నాడు. ముందుగా ఈ మూవీని సూపర్ స్టార్ మహేష్‌తో చేయాలనుకున్నాడు. కానీ అది కుదరలేదు. ఆ తర్వాత పవర్ స్టార్ పవన్‌ను సంప్రదించాడు. అప్పుడు కూడా ఈ సినిమా విషయంలో ఓ కొలిక్కి రాలేదు. అయితే తాజాగా పూరి తన డ్రీమ్ ప్రాజెక్ట్‌ను రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా తెరకకెక్కించాలని భావించాడు. ఈ సినిమా చిత్రీకరణ కూడా మొదలు కానుందని పూరి అధికారికంగా ప్రకటించాడు. తాజాగా ఈ మూవీకి మరో చిక్కు ఎదురైంది. ఈ సినిమాకు ఈ మూవీ టైటిలే ఈ చిక్కును తెచ్చిపెట్టింది. ప్రస్తుతం ఇదే టైటిల్‌తో మరో రెండు సినిమాలు తెరకెక్కుతున్నాయి.
వాటిలో ఒకటి జయం రవి హీరోగా తమిళంలో చిత్రీకరణ జరుపుకుంటుంది. అదే విధంగా మరో సినిమా పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా మలయాళంలో తెరకెక్కుతోంది. అంతేకాకుండా పృథ్వీరాజ్ తన సినిమా ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు రానుందని కూడా ప్రకటించాడు. ఇప్పుడు పూరి సినిమా పాన్ ఇండియా కావడంతో తమిళ్, మలయాళం ప్రేక్షకుల్లో కన్ఫ్యూజన్ వచ్చే అవకాశం ఉందని, పూరి తన సినిమా టైటిల్ మార్చుకోవాల్సి వస్తుందని నెట్టింట టాక్ వినిపిస్తోంది. మరి పూరి తన డ్రీమ్ ప్రాజెక్ట్ పేరు విషయంలో ఏం చేస్తాడన్నది ప్రేక్షకులకు కోటి రూపాయల ప్రశ్నగా మారింది. మరి ఏం జరుగుతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.