- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎన్నికల్లో ఘన విజయం..తల్లి ఆశీర్వాదం తీసుకున్న ప్రధాని మోడీ
దిశ, వెబ్ డెస్క్: దేశానికి అధిపతి అయిన తల్లికి మాత్రం కొడుకే.. ఈ వ్యాఖ్యలు శుక్రవారం ప్రధాని మోడీ తన తల్లిని కలిసిన సందర్భంగా చేసిన పనికి సరిగ్గా సూట్ అవుతాయి. ప్రధాని మోడీ రెండు రోజుల పర్యటన నిమిత్తం సొంత రాష్ట్రం అయిన గుజరాత్‌కు వెళ్లిన విషయం విధితమే. కాగా, ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ ఘన విజయం సాధించిన సందర్భంగా.. గుజరాత్ వెళ్లిన ప్రధాని మోడీ గాంధీనగర్‌లో ఉన్న తన తల్లి హీరాబెన్ నివాసానికి వెళ్లి ఆమె ఆశీర్వాదం తీసుకుని.. పాదాభివందనం చేశారు. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే, గతంలో కూడా మోడీ చాలాసార్లు ఇలా తల్లికి పాదాభివందనం చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొట్టాయి. కాగా, ఈ ఏడాది చివరన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ కార్యాలయంలో బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో భేటి అయి.. నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.
Gujarat: Prime Minister Narendra Modi meets his mother Heeraben Modi at her residence, in Gandhinagar pic.twitter.com/4CvlnsPQtm
— ANI (@ANI) March 11, 2022