Draupadi Murmu: చీపురు పట్టి... ఆలయాన్ని శుభ్రం చేసిన రాష్ట్రపతి అభ్యర్థి

by Sathputhe Rajesh |   ( Updated:2022-06-22 07:09:19.0  )
Presidential Candidate Draupadi Murmu Sweeps Temple Floor In Rairangpur
X

దిశ, వెబ్‌డెస్క్: Presidential Candidate Draupadi Murmu Sweeps Temple Floor In Rairangpur| ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా జార్ఖండ్ మాజీ గవర్నర్, సంతాల్‌ తెగకు చెందిన ద్రౌపది ముర్ము పేరును బీజేపీ అధిష్టానం ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆమెకు కేంద్ర ప్రభుత్వం భద్రతను పెంచింది. జెడ్‌ప్లస్ కేటగిరీ భద్రత కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఆమెకు నేటి నుంచి సీఆర్పీఎఫ్ దళాలు భద్రత కల్పించనున్నాయి. అయితే రాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ ప్రకటించిన నేపథ్యంలో ఇవాళ ఒడిశాలోని రాయ్‌రంగ్‌పూర్‌లోని శివాలయానికి ద్రౌపది ముర్ము వెళ్లారు. చీపురుతో ఆమె స్వయంగా ఆలయాన్ని శుభ్రం చేశారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు.

Advertisement

Next Story