- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రష్యా మారణ కాండ ఆపాలి.. పిలుపునిచ్చిన సీపీఐఎంఎల్ కార్యదర్శి
దిశ, అమరచింత: ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న మారణకాండను ఆపాలని సీపీఐఎంఎల్ ప్రజాపంథా వనపర్తి జిల్లా కార్యదర్శి అరుణ్ కుమార్ పిలుపునిచ్చారు. ప్రజాపంథా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గురువారం మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై ప్లకార్డులతో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సామ్రాజ్యవాద విధానాలను తాము వ్యతిరేకిస్తున్నామని అన్నారు. పేద దేశమైన ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్ధాన్ని వెంటనే విరమించాలన్నారు. ప్రపంచంలో ఒక దేశం మీద మరొక దేశం యుద్ధం చేయటం వల్ల ఆకలి చావులు, పేదరికం, అధిక ధరలు పెరిగి, ప్రజలు బ్రతక లేని పరిస్థితులు దుర్భరంగా ఉంటాయన్నారు.
ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా, ఐక్యరాజ్య సమితి కల్పించుకుని, శాంతియుత వాతావరణంలో ఇరుదేశాల మధ్య చర్చలు జరిపి, సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి సి రాజు, పట్టణ కార్యదర్శి కె రాజన్న, మండల నాయకులు A సామేలు, ప్రేమరత్నం, భక్తి, మస్లామని, కురుమన్న, రాంచందర్, విజయ్, జగదీష్, సంజీవ, కిరణ్, భీమన్న, సత్యన్న, మహిముద్ తదితరులు పాల్గొన్నారు.