- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Mahesh Babu: నువ్వు కాపాడిన 3772 వ ప్రాణం.. స్టార్ హీరోపై నెట్టింట ప్రశంసలు
దిశ, సినిమా: సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) పేరు ప్రజెంట్ సోషల్ మీడియాలో మారుమోగుతోంది. ఎన్లో ఏళ్లుగా ఆయన ‘మహేశ్ బాబు ఫౌండేషన్’ (Mahesh Babu Foundation) పేరుతో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అంతే కాకుండా.. ఆంధ్ర హాస్పిటల్ (Andhra Hospital) సౌజన్యంతో ఎంతో గుండె సంబంధిత జబ్బులకు ఉచితంగా వైద్య సేవలు (Medical Services) అందించి ఎంతో మందిని కాపాడిన గొప్ప మనిషిగా మహేశ్ బాబు పేరు తెచ్చుకున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మరో ప్రాణాన్ని కాపాడి ప్రజలతో ప్రశంసలు అందుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని తూర్పు గోదావరి (East Godavari) జిల్లా కత్తుల వారి పేటకు చెందిన రెండేళ్ల రిత్విక (Ritvika) గుండెలో హోల్ ఉందని, దానికి ఆపరేషన్ చెయ్యాలంటే లక్షల్లో ఖర్చు అవుతుందని తెలియడంతో మహేశ్ బాబు ఫ్యాన్స్‌ని సంప్రదించారు తల్లిదండ్రులు. ఇక మహేశ్ బాబు ఫౌండేషన్ సాకారంతో ఆ చిన్నారికి ఉచితంగా హార్ట్ ఆపరేషన్ (heart operation) చేయించారు. అందుకు కృతజ్ఞతగా.. కత్తుల వారి పేటలో మహేశ్ ఫ్యాన్స్ ఫ్లెక్సీ (Flexi)లు ఏర్పాటు చెయ్యగా.. ప్రజెంట్ అవి సోషల్ మీడియాలో విశేషంగా వైరల్ అవుతున్నాయి. అందులో.. ‘నువ్వు కాపాడిన 3772 వ ప్రాణం మా పి గన్నవరం ది సామీ. నువ్వే మా దేవుడని నువ్వు నమ్మే పని లేదు. మాకు నమ్మించే అవసరం లేదు. ఇది నీ దర్శనం.. నిదర్శనం’ అంటూ కోటేషన్స్ పెట్టారు. ప్రజెంట్ ఇవి వైరల్‌గా మారడంతో.. మహేశ్ బాబుపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు.