- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
Prabhas: ప్రభాస్ బర్త్‌డే స్పెషల్.. రాజాసాబ్ నుంచి అదిరిపోయే అప్డేట్
దిశ, సినిమా: ‘సలార్’ (salar), ‘కల్కి 2898’ (Kalki 2898) వంటి చిత్రాలతో వరుస హిట్స్ అందుకున్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas).. ప్రజెంట్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీలో ‘రాజాసాబ్’ (Rajasaab) ఒకటి. రొమాంటిక్ హారర్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ (TG Vishwaprasad) నిర్మిస్తుండగా.. మారుతీ (Maruti) దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రజెంట్ షూటింగ్ శరవేగంగా జరుగుతోన్న ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్, ఫ్యాన్ ఇండియన్ గ్లింప్స్ ఫ్యాన్స్‌ను విశేషంగా ఆకట్టుకున్నాయి. అయితే.. ఇప్పుడు అభిమానులను మరింత ఎగ్జైట్ చేసే విధంగా ‘రాజాసాబ్’ నుంచి మరో అప్డేట్ ఇచ్చారు చిత్ర బృందం.
అక్టోబర్ 23న రెబల్ స్టార్ బర్త్‌డే (birthday) కావడంతో ఇప్పటినుంచే పండుగా వాతావరణం స్టార్ట్ అయింది. ఈ క్రమంలోనే ఆయన నటిస్తున్న సినిమాల నుంచి అప్డేట్స్ (Updates) వస్తున్నాయి. ఇందులో భాగంగా.. తాజాగా ‘రాజాసాబ్’ నుంచి ఓ అప్డేట్ ఇచ్చారు చిత్ర బృందం. ఈ రోజు సాయంత్రం 4:05 గంటకు స్పెషల్ పోస్టర్ రిలీజ్ (Special Poster) చేయనున్నట్లు ప్రకటిస్తూ.. ‘నేను రెడీ.. మీరు రెడీనా’ అనే క్యాప్షన్ ఇచ్చారు. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన ట్వీట్ వైరల్ కావడంతో.. పోస్టర్ కోసం ఈగర్‌గా ఎదురు చూస్తు్న్నారు ఫ్యాన్స్ (fans). కాగా.. ఈ సినిమాలో నిధి అగర్వాల్ (Nidhi Agarwal), మాళవిక మోహనన్ (Malavika Mohanan) హీరోయిన్లుగా నటిస్తుండగా.. రిద్ధి కుమార్, సంజయ్ దత్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
4.05PM…….🕺🏻
— The RajaSaab (@rajasaabmovie) October 21, 2024
Nenu ready..
Meeru ready na?#Prabhas #TheRajaSaab pic.twitter.com/R15IzBO9dg