- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Pooja Hegde: పూజ హేగ్డేతో ఐటం సాంగ్ అంటే భయపడుతున్న నిర్మాతలు!
దిశ, వెబ్‌డెస్క్: సాత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన హాట్ బ్యూటీ పూజ హేగ్డే.. ఫుల్ బిజీ యాక్టర్‌గా మారిపోయింది. టాలీవుడ్, కోలీవుడ్ హీరోలతో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది ఈ బుట్టబొమ్మ. ప్రస్తుతం తమిళ్ స్టార్ హీరో దళపతి విజయ్‌తో నటించిన 'బీస్ట్' సినిమా విడుదలకు సిద్ధంగా ఉండటంతో ప్రమోషన్లలో బిజీగా ఉంది ఈ భామ. అయితే, ప్రస్తుతం పూజ గురించి ఓ వార్త సినీ సర్కిల్స్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది. హీరోయిన్‌గా ఆకట్టుకున్న ఈ హాట్ బ్యూటీ.. ఐటం సాంగ్స్‌లలో కూడా నటించి అభిమానులను ఉర్రూతలుగించింది.
రంగస్థలం సినిమాలో జిగేల్ రాణిగా ఆడిపాడి అభిమానులను విపరీతంగా ఆకట్టుకోంది బుట్టబొమ్మ. డ్యాన్స్‌లో హీరోలకు పోటీగా నటించే ఈ అందాల భామ కోసం.. నిర్మాతలు అమ్మడు అడిగినంత ఇచ్చేందుకు రెడీగా ఉన్నారు. తాజాగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎఫ్ 3 మూవీలో ఐటం సాంగ్ కోసం మూవీ యూనిట్ పూజను సంప్రదించినట్లు సమాచారం. అయితే, ఈ ఐటెం సాంగ్‌లో నటించేందుకు పూజ హేగ్డే 1.25కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఒక్క పాట కోసం మరీ అంతా రెమ్యూనరేషన్ ఏంటి అని షాకైన నిర్మాతలు.. చివరికి కోటి రూపాయలు ఇచ్చేందుకు ఓకే చెప్పినట్లు సమాచారం.