- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ పార్టీ నేతలు టచ్‌లోనే ఉన్నారు.. బాంబు పేల్చిన పొంగులేటి
దిశ ప్రతినిధి, ఖమ్మం: మాజీ ఎంపీ, టీఆర్ఎస్ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన హాట్స్ కామెంట్స్ మళ్లీ చర్చనీయాంశంగా మారాయి. గురువారం ఖమ్మం జిల్లా తిరుమలయపాలెం పర్యటనలో పొంగులేటి వ్యాఖ్యలు గులాబీ పార్టీలో గుబులు పుట్టిస్తున్నాయి. ఢిల్లీలోని కాంగ్రెస్, బీజేపీ పెద్దలు తనను సంప్రదిస్తూనే ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో ప్రజాతీర్పును వదులుకునే ప్రసక్తే లేదన్నారు. తాను ప్రస్తుతం గులాబీ తోటలోనే ఉన్నానని, ఎన్ని ముళ్లు గుచ్చుకున్నా ఇందులోనే ఉంటానని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తనకు అవకాశం ఇస్తుందని ఆశిస్తున్నానని, ఒకవేళ ఇవ్వకపోయినా ప్రజాక్షేత్రంలోకి వెళ్లడం ఖాయమని స్పష్టం చేశారు. ఇప్పటివరకు ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ.. కేటీఆర్ కానీ పోటీ చేయాలనే ఆదేశాలు ఇవ్వలేదని చెప్పుకొచ్చారు. ఎట్టిపరిస్థితుల్లో ప్రజాక్షేత్రంలోకి వెళ్లడం ఖాయమని, అప్పుడు వాళ్లే తీర్పు ఇస్తారని చేసిన కామెంట్స్ రాజకీయ వర్గాలను ఆలోచనలో పడేశాయి. ఇటీవల పొంగులేటి శ్రీనివాసరెడ్డి వేస్తున్న అడుగులు అన్నీ ఏదో మార్పు జరుగుతుందనే సంకేతాలే ఇస్తున్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. రెండ్రోజుల క్రితం మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు తన సొంత జిల్లాలో జరిగిన సీఎం సభకు వెళ్లకుండా పొంగులేటిని కలవడం కూడా చర్చనీయాంశమైంది.
ఒకవేళ టీఆర్ఎస్ నుంచి టికెట్ రాకపోతే ఎలా..?
2018 ఎన్నికల తర్వాత పొంగులేటికి టీఆర్ఎస్ లో ఏ పదవీ లేకుండా పోయింది. అప్పటినుంచి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఎప్పటికప్పుడు ఆయనకు హామీలు ఇస్తూనే, అది మాత్రం నెరవేర్చకపోవడంతో పొంగులేటితోపాటు ఆయన అనుచరులు, అభిమానులు గులాబీ పార్టీపై అసహనంతోనే ఉన్నారు. అప్పటి నుంచి పార్టీలో శ్రీనివాసరెడ్డికి అవమానాలు ఎదురవుతూనే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో పార్టీ మారాలని అయనకు ఎంత ఒత్తిడి వచ్చినా..? కొన్ని 'ప్రత్యేక' కారణాల వల్ల టీఆర్ఎస్ లో కొనసాగుతున్నారు. ఇప్పుడు పరిస్థితులు మారాయి. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో వచ్చేసారి తాను ప్రజాక్షేత్రంలోనే ఉంటానని చెప్పారు. అయితే ఒకవేళ టీఆర్ఎస్ నుంచి పోటీ చేసే అవకాశం రాకపోతే పొంగులేటి పయనం ఎటువైపో అని ఆయన అభిమానాలు, అనుచరులతో పాటు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కచ్చితంగా బీజేపీ లేకా కాంగ్రెస్ లోకి వెళతారని, ఉమ్మడి ఖమ్మం జిల్లాతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా మరికొంత మంది సీనియర్లు ఆయన బాటలోనే నడవనున్నట్లు సమాచారం.
బీజేపీనా..? కాంగ్రెస్సా..?
వాస్తవానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని తమ పార్టీల్లోకి రప్పించేందుకు ఢిల్లీ స్థాయిలో అటు బీజేపీతోపాటు కాంగ్రెస్ కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. బీజేపీ పెద్దలు గతంలోనే మంచి ఆఫర్ ఇచ్చారని, ఆయన రాకకోసం వెయిట్ చేస్తున్నట్లుగా కూడా అనేకసార్లు వార్తలు వచ్చాయి. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి మళ్లీ పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు పొంగులేటి కోసం తీవ్రంగా ప్రయత్నించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే శ్రీనివాస రెడ్డి మాత్రం ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ దూకుడు మీదుంది. గురువారం వచ్చిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో కూడా కమలం పార్టీ సత్తా చాటడంతో ఒకవేళ వెళ్లాల్సి వస్తే బీజేపీవైపే మొగ్గు చూపుతారని విశ్వసనీయ వర్గాల సమాచారం. రాష్ట్రంలో కూడా వచ్చే ఎన్నికల్లో బీజేపీకే స్కోప్ ఉండడంతో ఆ పార్టీలో చేరితేనే పొంగులేటి రాజకీయ భవిష్యత్ ఉంటుందనే చర్చ జరుగుతోంది.
ఎప్పటికప్పుడు గాడ్ ఫాదర్ సలహాలు..
పొంగులేటికి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లో గాడ్ ఫాదర్ లాంటి వారని అంటుంటారు. ఈ నేపథ్యంలోనే పొంగులేటి తన రాజకీయ భవిష్యత్తు కోసం ఎప్పటికప్పుడు జగన్ తో భేటీ అవుతూనే ఉన్నారు. ఇప్పటికే పలుమార్లు ఇద్దరూ కలిసి చర్చించుకున్నట్లు కూడా సమాచారం. తాజాగా రెండ్రోజుల క్రితం కూడా భేటీ జరిగినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. జగన్ కూడా బీజేపీలో చేరాలని పొంగులేటికి సూచించినట్లు తెలుస్తోంది. బీజేపీ పెద్దలతో పొంగులేటి, ఆయన అనుచరుల రాజకీయ భవిష్యత్ కోసం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతానని, సమయం చూసి కాషాయ కండువా కప్పుకోవాలని సూచించినట్లు విశ్వసనీయ సమాచారం. అంతేకాదు.. రాష్ట్ర బీజేపీ నేతలు సైతం తామంతా అండగా ఉంటామని భరోసా ఇచ్చినట్లు కూడా తెలుస్తోంది. అంతేకాదు.. పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు దాదాపు అన్ని జిల్లాల్లో టీఆర్ఎస్ నుంచి అసంతృప్తిగా ఉన్న పెద్ద నేతలు కదిలే అవకాశాలు ఉంటాయని చెప్పినట్లుగా కూడా ప్రచారం జరుగుతోంది.
- Tags
- Ex MP Ponguleti