పెళ్లిలో డీజే సంబరాలు.. న్యాయం కావాలంటూ బంధువుల ఆందోళన.. ఏం జరిగిందంటే?

by Manoj |
పెళ్లిలో డీజే సంబరాలు.. న్యాయం కావాలంటూ బంధువుల ఆందోళన.. ఏం జరిగిందంటే?
X

దిశ, ఖానాపూర్ : పెండ్లి సంబరాల్లో డీజేతో బరత్ చేస్తుండగా.. పెండ్లి బృందంలోని ఒకరిపై పోలీసులు చేయి చేసుకోవడంతో అక్కడ హైటెన్ష‌న్ వాతావ‌ర‌ణం నెల‌కొంది. వివరాల్లోకి వెళితే.. నిర్మ‌ల్ జిల్లా పెంబి మండ‌ల కేంద్రంలో బొడుగు కళ్యాణ్ వారి పెళ్లి బరత్ చేస్తుండగా ఒకరిపై ఎస్ఐ మహేష్ విరుచుకుపడ్డారన్నారు. అంతేకాకుండా ఆ ఎస్ఐ పిల్ల‌లు, ఆడ‌వాళ్లు అని కూడా చూడ‌కుండా చిత‌క‌బాదాడ‌ని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో పెండ్లి బంధువులు పోలీస్ స్టేష‌న్ ఎదుట ఆందోళ‌న నిర్వ‌హించారు. త‌మ‌కు న్యాయం చేయాల‌ని, త‌మ‌పై దాడిచేసిన వారిని శిక్షించాల‌ని డిమాండ్ చేశారు.

పర్మిషన్ లేకుండా నడిపిస్తే కఠిన చర్యలు..

డీజేను పర్మిషన్ లేకుండా నడిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఖానాపూర్ సీఐ అజయ్ బాబు హెచ్చరించారు. ఈ మేరకు ఖానాపూర్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పెంబి మండల కేంద్రంలో బుధవారం రాత్రి పోలీస్ సిబ్బంది ఏఎస్ఐ గంగారెడ్డి, కానిస్టేబుల్ సంతోష్ పెట్రోలింగ్‌కు బయలుదేరగా.. అదే సమయంలో డీజేకు పర్మిషన్ లేకుండా బొడుగు కళ్యాణ్ వారి పెండ్లి బృందం డీజేతో డ్యాన్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో పోలీస్ సిబ్బంది డీజేకు పర్మిషన్ లేకుండా నడపకూడదని సూచించారు. దీంతో మద్యం సేవించి, మత్తులో ఉన్న పెళ్లి బృందంలోని కొందరు ఏఎస్ఐ గంగారెడ్డి, కానిస్టేబుల్ సంతోష్‌లను పిడి గుద్దులు గుద్ధగా.. సంతోష్‌ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. ఈ విషయాన్ని పోలీస్ సిబ్బంది ఎస్ఐ మహేష్‌కు ఫిర్యాదు చేయగా.. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ సమస్యను పరిష్కరించారని సీఐ వివరించారు. పోలీస్ సిబ్బంది పై చేయి చేసుకొని, వారి విధులకు ఆటంకం కలిగించిన వారిపై వీడియోల ఆధారంగా 353, 188, 341 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఖానాపూర్ ఎస్ఐ రజినీకాంత్ ఉన్నారు.

Advertisement

Next Story