Presidential Election 2022: రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్​ షురూ.. పార్ల‌మెంట్‌లో ఓటేసిన మోడీ

by Sathputhe Rajesh |   ( Updated:2022-07-18 07:33:05.0  )
PM Modi Cast a Vote in Presidential Election
X

దిశ, డైనమిక్ బ్యూరో: PM Modi Cast a Vote in Presidential Election| రాష్ట్ర‌ప‌తి ఎన్నిక కోసం నేడు దేశ‌వ్యాప్తంగా ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. పార్ల‌మెంట్‌తో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీల్లో ఓటింగ్ నిర్వ‌హిస్తున్నారు. 16వ రాష్ట్ర‌ప‌తి ఎన్నిక కోసం నేడు ఓటింగ్ జ‌రుగుతోంది. పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లో ఏర్పాటు చేసిన బాక్సులో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ ఓటేశారు. ఇవాళ్టి నుంచి వ‌ర్షాకాల పార్ల‌మెంట్ స‌మావేశాలు ప్రారంభం అవుతున్న నేప‌థ్యంలో.. వివిధ పార్టీల‌కు చెందిన ఎంపీలు కూడా పార్ల‌మెంట్‌లోనే త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. ఇక వివిధ రాష్ట్రాల‌ సీఎంలు త‌మ త‌మ అసెంబ్లీల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో ఓటేశారు. యూపీ సీఎం యోగి ఆదిత్య‌నాథ్, ఒడిశా సీఎం న‌వీన్ ప‌ట్నాయ‌క్, త‌మిళ‌నాడు సీఎం ఎంకే స్టాలిన్, గుజ‌రాత్ సీఎం భూపేంద్ర ప‌టేల్, ఢిల్లీ డిప్యూటీ సీఎం మ‌నీశ్ సిసోడియా, రాజ‌స్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ , ఏపీ సీఎం జ‌గ‌న్, మ‌ధ్య‌ప్ర‌దేశ్ సీఎం శివ‌రాజ్ సింగ్ చౌహాన్ తమ తమ అసెంబ్లీల్లో ఓటేశారు. అయితే, ఉద‌యం 10 నుంచి సాయంత్రం 5 వ‌ర‌కు ఓటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. కాగా, రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో ఎన్డీఏ అభ్య‌ర్థిగా ద్రౌప‌ది ముర్ము, విప‌క్షాల అభ్య‌ర్థిగా య‌శ్వంత్ సిన్హా పోటీప‌డుతున్న విష‌యం తెలిసిందే.

ఇది కూడా చదవండి: Sri Lanka లో ఎమర్జెన్సీ ప్రకటించిన తాత్కాలిక అధ్యక్షుడు

Advertisement

Next Story