కాంగ్రెస్ మహిళా నేతకు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కౌంటర్

by Manoj |
కాంగ్రెస్ మహిళా నేతకు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కౌంటర్
X

దిశ, వెెబ్ డెస్క్: మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నెట్టా డిసౌజా కేంద్రమంత్రి స్మృతి ఇరానీతో విమానంలో తలపడ్డ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. గౌహతి వెళుతున్న విమానంలో ప్రయాణిస్తున్న ఈ ఇద్దరూ విమానం ల్యాండ్ అయి ప్రయాణికులు కిందకి దిగుతున్న సమయంలో వంట గ్యాస్ ధర పెరుగుదలపై వాదులాట జరిగింది. ఈ చర్చను తొలుత ప్రారంభించిన డిసౌజా వంట గ్యాస్ ధరలు ఎందుకు అంతగా పెంచారని కేంద్రమంత్రిని నిలదీశారు. దానికి స్మతి ఇరానీ సమాధానమిస్తూ పలు సంక్షేమ పథకాల ద్వారా పేదలకు కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తోందన్నారు. దేశవాసులకు ఉచితంగా రేషన్ ఇస్తున్నాని, 1.83 కోట్ల ఉచిత వ్యాక్సిన్లను ప్రజలకు అందించామని కేంద్రమంత్రి చెబుతున్నట్లు వీడియోలో వినిపించింది.

మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఇంకా కేంద్రమంత్రిపై ప్రశ్నల దాడి చేస్తుండగా స్మృతి ఇరానీ ప్రశాంతంగా ఆ వీడియోలో కనిపించారు. పైగా విమానం దిగడానికి వెళుతున్న ప్రయాణీకులకు అడ్డుగా ఉన్నారని డిసౌజాకు సూచించారు. వంట గ్యాస్‌ స్టౌలలో గ్యాస్ లేదని అవి ఖాళీగా ఉన్నాయని డిసౌజా ఆరోపిస్తుంటే, దయచేసి అబద్ధం చెప్పొద్దు అని కేంద్ర మంత్రి తోసిపుచ్చారు. తనపై వరుసగా ఆరోపణలు గుప్పిస్తున్నారు అంటూ స్మృతి చెబుతుండటం ఈ వీడియోలో స్పష్టంగా వినబడింది.

Advertisement

Next Story