- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీఎస్పీ ని అడ్డుకునేందుకే పీకేలు..! ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
దిశ, రఘునాథపల్లి : తెలంగాణ రాష్ట్రంలో బహుజన సమాజ్‌వాదీ పార్టీ ప్రభంజనాన్ని అడ్డుకునేందుకే సర్వేయర్ పీకే, డ్రామా ఆర్టిస్ట్ ప్రకాశ్ రాజ్‌లను కేసీఆర్ రంగంలోకి దించారని బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. రాష్ట్రంలో బీఎస్పీ ప్రభంజనాన్ని అడ్డుకునేందుకు నియంతృత్వమైన చర్యలను అవలంభిస్తోందని అన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్‌కో రూల్... ఇతర పార్టీలకు మరో రూల్ నడుస్తోందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం జరిగితే ఉద్యోగాలు వస్తాయని భావించిన నిరుద్యోగులకు నిరాశ, నిస్పృహాలే మిగులుతున్నాయని అన్నారు. ఆదివారం రాత్రి జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలోని ఖిలాషాపూర్ గ్రామంలో బహుజన రాజ్యాధికార యాత్ర పేరుతో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
300 రోజుల పాటు బహుజన రాజ్యాధికార యాత్ర కొనసాగుతుందని ఆర్ ఎస్ ప్రవీణ్‌కుమార్ ఈసందర్భంగా ప్రకటించారు. ఎలాంటి వనరులు లేకపోయినా.. కేవలం గుండెబలంతో నిజాం పాలనపై తిరుగుబాటు చేసిన సర్వాయి పాపన్న జన్మినించిన ఖిలాషాపూర్ వేదికపై బహుజన సమాజ్ వాద్ పార్టీ సభ జరుపుకోవడం ఎంతో గర్వంగా ఉందని అన్నారు. 80వేల పుస్తకాలు చదివిన అపరా మేధావి అయిన ముఖ్యమంత్రి కేసీఆర్ పీకేలాంటి సర్వేయర్‌ను, డ్రామార్టిస్ట్ ప్రకాశ్ రాజ్‌లాంటివాళ్లను రంగంలోకి దింపి రాజకీయ ప్రలోభాలకు గురి చేయడానికి ప్రయత్నిస్తోందని అన్నారు. రూ. 600 కోట్లు ఇచ్చి పీకే ను అరువు తెచ్చుకోవలసిన అవసరం ఏంటని..? ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఉద్దేశించి అన్నారు. ఎన్నికలకు మూడు రోజుల ముందు డబ్బులు వెదజల్లడంపైనే రాజకీయ వ్యవస్థ కుతంత్రాలు కొనసాగుతున్నాయని అన్నారు.
రాష్ట్రంలో నియంతృత్వం నహీ చలేగా..
రాష్ట్రంలో టీఆర్ఎస్ కో రూల్... ఇతర పార్టీకో రూల్ నడుస్తోందని ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ధ్వజమెత్తారు. ఖిలాషాపూర్‌లో సభ నిర్వహణ మార్చి1 జరగాల్సి ఉండగా... ప్రభుత్వం అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి అనుమతులు ఆలస్యంగా ఇచ్చేలా చేసిందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధిస్తే ఉద్యోగాలస్తాయని ఆశపడిన నిరుద్యోగులకు నిరాశే మిగులుతోందన అన్నారు. రాష్ట్రంలో 33 లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు. నా చావుకు ముఖ్యమంత్రియే కారణమని పేర్కొంటూ నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్న సంఘటనలు గతంలో ఎప్పుడు జరగలేదని అన్నారు. అలాంటి పాలన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరవీరులైన 1300 మందిలో 99శాతం మంది బహుజనులే ఉన్నారని గుర్తు చేశారు.
బీఎస్‌పీ ని అడ్డుకునేందుకు కుట్రలు..
బీఎస్పీ పార్టీ నిర్వహించాల్సిన సభను అడ్డుకునేందుకు ఈ ప్రభుత్వం ఎన్నో ఆటంకాలు సృష్టించిందని అన్నారు. 15 రోజుల క్రితమ సభకు అనుమతి కావాలని పోలీస్ అధికారులకు వినతి చేసినా.. అనేక ఇబ్బందులకు గురి చేసిందని అన్నారు. అదే సమయంలో ఒమిక్రాన్ విజృంభించిన సమయంలోనూ టీఆర్ఎస్ పార్టీ సభలు, సమావేశాలు నిర్వహించిందని పేర్కొన్నారు. మీ మీటింగ్‌లకు పర్మిషన్లు వస్తున్నాయి.. మాకెందుకు ఇవ్వరంటూ సూటిగా ప్రశ్నించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ బీఎస్పీని చూసి భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. బీఎస్పీ.. విలువలకు కట్టుబడి ఉందని, మహనీయులు సూచించిన నైతిక విలువలకు కట్టుబడి పార్టీ నడుస్తుందని స్పష్టం చేశారు. బీఆర్ అంబేద్కర్ జీవిత చరిత్రను, రాజ్యాంగానికి కట్టుబడి పనిచేస్తుందన్నారు. రాజ్యాధికారమే బీఎస్పీ లక్ష్యంగా రాష్ట్రంలో 300 రోజుల యాత్రను చేపట్టిందని ప్రవీణ్ అన్నారు. రాజ్యాధికారం సాధనతోనే మిగతా అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని అన్నారు. ఈమూడు వందల రోజుల యాత్రలో తమకు ప్రజలు రక్షణగా ఉంటారని పేర్కొన్నారు.
అంతకు ముందు ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ జనగాం జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ పరిధిలోని రఘునాథపల్లి మండలం ఖిలాషాపూర్ గ్రామం నుంచి తన బహుజన రాజ్యాధికార యాత్రను ప్రారంభించారు. ఆదివారం రాత్రి ఖిలశాపూర్‌కు భారీగా తరలివచ్చిన ప్రజల, బీఎస్పీ పార్టీ కార్యకర్తల సమక్షంలో పోరాట యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా బిఎస్పి రాష్ట్ర అధ్యక్షుడు మంద ప్రభాకర్, కార్యదర్శులు మహతి కుమార్ చంద్రశేఖర్, వనిత రెడ్డి లతోపాటు జనగామ జిల్లా అధ్యక్షుడు తాళ్లపల్లి కుమార్ ఇతరులు పాల్గొన్నారు. కాగా ఈ యాత్రకు సుమారు ఐదు వేల మంది హాజరైనట్లు హాజరయ్యారు. అంతకు ముందు బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహానికి, అదే విధంగా ఖిలాషాపూర్ గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పూలమాలవేసి నివాళులర్పించారు.