డిసెంబర్ నాటికి ఉద్యోగుల సంఖ్యను రెట్టింపు చేయనున్న PhonePe!

by Mahesh |   ( Updated:2022-04-05 09:21:54.0  )
డిసెంబర్ నాటికి ఉద్యోగుల సంఖ్యను రెట్టింపు చేయనున్న PhonePe!
X

బెంగళూరు: ప్రముఖ డిజిటల్ చెల్లింపుల ప్లాట్‌ఫామ్ ఫోన్‌పే తన మొత్తం ఉద్యోగుల సంఖ్యను ఈ ఏడాది డిసెంబర్ నాటికి 5,400 మందితో రెట్టింపు చేయాలని భావిస్తున్నట్లు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. కంపెనీ ఇంజనీరింగ్, ఉత్పత్తి, వ్యాపారాభివృద్ధి, అనలిటిక్స్ సహా పలు విభాగాల కోసం వివిధ స్థాయిలలో కొత్తవారిని తీసుకోనున్నట్టు వెల్లడించింది. దేశంలో వివిధ ప్రాంతాల్లోని ఆఫీసుల్లో రాబోయే 12 నెలల్లోగా 2,800 ఉద్యోగాలను భర్తీ చేయాలని ఫోన్‌పే భావిస్తోంది. దీర్ఘకాలానికి స్థిరంగా ఉండే విధంగా సంస్థను రూపొందించే చర్యలు తీసుకుంటున్నామని, టెక్నాలజీని వినియోగించి ప్రతి ఒక్కరిని మెరుగైన సేవలను అందించాలని లక్ష్యాన్ని కలిగి ఉన్నామని ఫోన్‌పే హెచ్ఆర్ హెడ్ మన్‌మీత్ సంధు అన్నారు.

ఇటీవలే కంపెనీ మహిళల కోసం ప్రత్యేకంగా మదర్స్-ఎట్-ఫోన్‌పే కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీనివల్ల పిల్లలను చూసుకునే మహిళలు వారు సిద్ధంగా ఉన్నప్పుడే తిరిగి ఉద్యోగంలోకి చేరే విధంగా వెసులుబాటు లభిస్తుంది. అంతేకాకుండా కొత్తగా తల్లిదండ్రులైన వారి మధ్య బాధ్యతల సమానత్వాన్ని ప్రోత్సహించేందుకు పేరెంట్-ఎట్-ఫోన్‌పే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించింది. ప్రధానంగా ఫోన్‌పే సంస్థ కంపెనీ లీడర్‌షిప్ విభాగంలో మహిళలకు ప్రాధాన్యతను పెంచుతోంది. అంతేకాకుండా ఎల్‌బీటీక్యూఐ కమ్యూనిటీతో పాటు వైకల్యం ఉన్న వారిని కూడా ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలను తీసుకుంటున్నట్టు కంపెనీ వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed