ప్రధానిపై సొంత పార్టీలో తిరుగుబాటు..

by Javid Pasha |   ( Updated:2022-03-31 10:43:05.0  )
ప్రధానిపై సొంత పార్టీలో తిరుగుబాటు..
X

దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా అధికార పార్టీల పాలన విధానంపై ప్రతిపక్షాలు తిరుగుబాటు చేస్తుంటాయి. కానీ పాకిస్తాన్‌లో మాత్రం సొంతపార్టీ వారే ప్రధానికి పక్కలో బళ్లాలు అయ్యారు. దేశ ప్రధానిపై అధికార పార్టీ వారే తిరుగుబాటు చేస్తున్నారు. ఎన్నికల్లో 155 సీట్లు గెలిచిన ఇమ్రాన్ ఖాన్ పార్టీ మూడు ఇతర పార్టీలతో పొద్దు కుదుర్చుకుని అధికారం అందుకుంది. అయితే ఇమ్రాన్ సొంత పార్టీలోని 25 మంది సభ్యులు ఇమ్రాన్‌ను తిరస్కరిస్తున్నారు.

అయితే ఈ రోజు సాయంత్రం 6 గంటలకు ఇమ్రాన్ జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. అంతకన్నా ముందు సాయంత్రం 4:30 గంటలకు అవిశ్వాస తీర్మానంపై చర్చ ప్రారంభం కానుంది. ఇందులో ఇమ్రాన్ తప్పులను ఎత్తి చూపనున్నట్లు సమాచారం. ఈ సారి ఎన్నికల్లో ఎలాగైనా ఇమ్రాన్‌ను గద్దె దించాలని మిత్ర పక్షాలు సహా సొంత పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed