- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎలక్షన్‌లో ఓడిపోతామనే భయంతోనే ఉద్యోగాల నోటీఫికేషన్
దిశ, అడ్డగుడూర్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దాదాపు 8 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఇన్ని సంవత్సరాలుగా విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడిన సీఎం కేసీఆర్ విద్యార్థుల ఆత్మహత్యలు చవిచూసి ఇన్నాళ్లకు ఉద్యోగ ప్రకటన ఇచ్చారని బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కన్నెబోయిన రాము యాదవ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికైనా ప్రకటించిన ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఉద్యోగాల భర్తీకై భారతీయ జనతాపార్టీ మిలియన్ మార్చ్‌కి పిలుపు నిచ్చింది కాబట్టి సీఎం కేసీఆర్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన చేశారని అన్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో 25 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని వారికి 2018 లో నిరుద్యోగ భృతి 3000 చెల్లిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ముఖ్యమంత్రి మర్చిపోయారని ఎద్దేవా చేశారు. తెలంగాణ భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ టిఎస్‌పిఎస్‌సీ, జిల్లా కలెక్టర్ ఆఫీసులో, మండల రెవెన్యూ ఆఫీస్ లు ముట్టడించి వినతి వినతి పత్రాలు ఇచ్చి యువతలో చైతన్యం తీసుకురావడం లో బీజేవైఎం కీలక పాత్ర పోషించిందన్నారు.
బీజేవైఎం ఆధ్వర్యంలో అన్ని జిల్లా మంత్రులందరినీ ఎక్కడికక్కడ అడ్డుకోవడంతో దిక్కుతోచని పరిస్థితిలో ఉద్యోగ ప్రకటన చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా గత మూడు సంవత్సరాలుగా 3816 కోట్ల రూపాయలు విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించకుండా కాలయాపన చేస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా నిండు అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఇచ్చిన మాటను నిలబెట్టుకుని తక్షణమే టీఎస్పీఎస్సీ ద్వారా ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసి వారికి పరీక్షలు పారదర్శకంగా జరిపి నియామకాలు చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కోరుకుంటుందన్నారు.