జగన్ మోహన్ రెడ్డి కాదు.. మోసపురెడ్డి : లోకేశ్ ఫైర్

by Nagaya |
Nara Lokesh
X

దిశ, ఏపీ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి కాదని వైసీపీ కోటరీల కోసం పెట్టిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. బడ్జెట్ చూస్తుంటే చెప్పేది కొండంతా .. చేసేది గోరంతా అన్నట్లుగా ఉందని ధ్వజమెత్తారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు కేవలం ప్రచారానికే తప్ప ఎందుకు పనికిరావన్నారు. ఈ బడ్జెట్‌తో జగన్ మోహన్ రెడ్డి కాదు... జగన్ మోసపు రెడ్డి అని ప్రజలు ఓ నిర్ధారణకు వచ్చారని ధ్వజమెత్తారు. ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళిక నిబంధనలు ఉల్లంఘించారంటూ లోకేశ్ మండిపడ్డారు. అన్ని వర్గాలకు ఇచ్చే సంక్షేమ పథకాలను ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేకంగా ఇస్తున్నట్లు చూపటం ఆయా వర్గాలను మోసగించడం కాదా అని ప్రశ్నించారు.

అమ్మ ఒడి అబద్ధం, నాన్న బుడ్డి నిజమని ఈ బడ్జెట్‌తో నిరూపించారని ధ్వజమెత్తారు. వాహన మిత్ర అబద్దం, డ్రైవర్లను మోసం చేశారన్నది నిజం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్షేమ కార్యక్రమాలన్నింటికీ ఈ ప్రభుత్వం కోతలు పెడుతూ పోతోందని లోకేశ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రారంభంలో అమ్మఒడిని ఎంతో హంగు ఆర్భాటలతో ప్రారంభించిన ఈ ప్రభుత్వం ఆ తర్వాత హాజరు శాతం పేరుతో భారీ కోత పెట్టారని ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్, చంద్రబాబు కలిసి రూ. 1850 పింఛన్ ఇస్తే, తండ్రి కొడుకులు కలిసి ఇచ్చింది కేవలం రూ. 625 మాత్రమేనని ఈ విషయం ప్రజలు గ్రహించాలని సూచించారు.

మద్యపాన నిషేధం, విద్యారంగం, సంక్షేమం, రైతులు, చేనేత ఇలా అన్ని వర్గాలను జగన్ మోసం చేశారంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వైసీపీ ప్రభుత్వం ఇప్పటికైనా మేలుకోవాలని తమ కోటరీ కోసం కాకుండా రాష్ట్ర ప్రజల కోసం కేటాయింపులు చేపట్టాలని లోకేశ్ డిమాండ్ చేశారు. అలాగే టీడీపీ హయాంలో అమలు చేసిన కార్యక్రమాలను పునరుద్ధరించాలని లోకేశ్ డిమాండ్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed