కష్టపడి పనిచేసే గుణం నా డీఎన్‌ఏలో ఉంది.. రూమర్స్‌పై నటి సీరియస్

by Manoj |
కష్టపడి పనిచేసే గుణం నా డీఎన్‌ఏలో ఉంది.. రూమర్స్‌పై నటి సీరియస్
X

దిశ, సినిమా: బ్యూటీఫుల్ మోడల్ అండ్ యాక్ట్రెస్ నిమ్రిత్ కౌర్ అహ్లూవాలియా తన కెరీర్ గురించి వస్తున్న రూమర్స్‌పై స్పందించింది. కొంతకాలంగా మానసిక ఆరోగ్యం బాగాలేకపోవడంతో డాక్టర్ల సలహా మేరకు రెస్ట్ తీసుకుంటున్నట్లు తెలిపింది. అయితే ఇదే అదనుగా కొంతమంది సృష్టించిన పుకార్లతో అభిమానులు ఆందోళన చెందినట్లు తన దృష్టికి వచ్చిందన్న నటి.. ఏం జరిగిందో తెలుసుకోకుండా ఎవరూ గందరగోళానికి గురికావొద్దని కోరింది. 'కొద్ది రోజులు నాకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు.

వైద్యులను సంప్రదించడంతో 'బ్రెయిన్ బర్న్ అవుట్' అని నిర్ధారణ అయింది. ఈ క్లిష్ట సమయంలో విశ్రాంతి తీసుకోవడం తప్ప మరో ఆప్షన్ లేదన్నారు. మీరు అనుకుంటున్నట్లు నేను శ్రమకు దూరంగా ఉండే వ్యక్తిని కాదు. మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చాను. కాబట్టి కష్టపడి పనిచేసే గుణం నా డీఎన్‌ఏలో ఉంది' అంటూ చెప్పుకొచ్చింది. చివరగా తనతో కనెక్ట్ అయ్యే అభిమానులు నిజాయితీగా ఉండాలని.. దారిలో కొండలు, స్పీడ్ బ్రేకర్లు ఉంటాయనే విషయం తెలుసుకోవాలంటూ ముగించింది.

Advertisement

Next Story

Most Viewed