- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సోదరుడు చనిపోయినా నన్ను వదల్లేదు.. నిక్కీ ఎమోషనల్
దిశ, సినిమా : టెలివిజన్ యాక్ట్రెస్ నిక్కీ తంబోలి నెట్టింట భారీ ట్రోలింగ్ ఎదుర్కొంటోంది. పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా మరణాన్ని తట్టుకోలేక ఇటీవల ఆమె ఎయిర్పోర్ట్లో మీడియా ముందే కంటతడి పెట్టిన సంగతి తెలిసిందే. దీంతో తను ఓవర్ యాక్టింగ్ చేస్తుందంటూ నెటిజన్లు ట్రోల్ చేశారు. తాజాగా ఈ విమర్శలపై స్పందించిన నటి.. తాను నవ్వినా, ఏడ్చినా కొంతమంది ట్రోల్ చేస్తూనే ఉంటారని, మంచి స్నేహితున్ని కొల్పోయిన బాధ మాటల్లో చెప్పలేనని, చెప్పినా అలాంటివాళ్లకు అర్థం కాదని తెలిపింది.
అంతేకాదు బిగ్బాస్ షోలో కూడా సిద్ధు గురించి ఎన్నోసార్లు మాట్లాడినట్లు చెప్పిన నిక్కీ.. ఎయిర్పోర్టులో తన గురించి అడిగేసరికి కన్నీళ్లు ఆపుకోలేకపోయాని చెప్పింది. ఇక గతంలో తన సోదరుడు మరణించినపుడు ఇలాగే ట్రోల్ చేశారని ఎమోషనల్ అయిన నటి.. కొంతమంది తనను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని, అలాంటి వాటికి తానెప్పుడూ బాధపడనని, విమర్శలను ప్రశంసలుగా భావిస్తూ మరింత కష్టపడి పనిచేస్తానని చెప్పడం విశేషం.