Niharika Konidela: నిహారిక టాలీవుడ్ బంగారం.. డైరెక్టర్ కామెంట్స్ వైరల్

by sudharani |
Niharika Konidela: నిహారిక టాలీవుడ్ బంగారం.. డైరెక్టర్ కామెంట్స్ వైరల్
X

దిశ, సినిమా: వర్ధన్‌ గుర్రాల, హమరేశ్, శాంతి తివారి, నిత్యశ్రీలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘ట్రెండింగ్ లవ్’ (Trending Love). వెల్‌నోన్‌ షార్ట్‌ఫిలిమ్‌ మేకర్‌ హరీశ్‌ నాగరాజు (Maker Harish Nagaraju) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘దొరకునా ఇటువంటి ప్రేమ’ ట్యాగ్‌లైన్‌ (tagline). తన్వీ ప్రొడక్షన్స్, ఆర్‌డిజి ప్రొడక్షన్స్‌ పతాకాలపై సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీ నుంచి ఫస్ట్‌లుక్‌ను ప్రముఖ నటి, నిర్మాత కొణిదెల నిహారిక (Konidela Nebula) చేతులమీదుగా విడుదల చేసింది చిత్రయూనిట్‌. ఈ సందర్భంగా నిహారిక మాట్లాడుతూ.. ‘‘ట్రెండింగ్ లవ్‌’ దర్శకుడు హరీశ్‌తో నేను గతంలో యూట్యూబ్‌ (YouTube) కోసం చేసిన షార్ట్‌ఫిలింలో పనిచేశాను. ఆయన ఎంతో టాలెంట్‌ ఉన్న దర్శకుడు. ఈ సినిమా టైటిల్‌ సమాజంలో ఉన్న కరెంట్‌ సిట్యూవేషన్‌ను ఎలివేట్‌ చేసేలా ఉంది. సినిమాలోని కొన్ని కట్స్‌ చూశాను. చాలా బావున్నాయి. ఈ టీమ్‌ అందరికి మంచి సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అని తెలిపింది.

దర్శకుడు హరీశ్‌ నాగరాజు మాట్లాడుతూ.. ‘మా సినిమా ఫస్ట్‌లుక్‌ను మీ చేతుల మీదుగా ఓపెన్ చెయ్యాలి అని ఒక్క మెసేజ్ పెట్టిన వెంటనే.. సరే అని మాటీమ్‌ని ఎంకరేజ్‌ చేయటానికి ముందుకొచ్చారు నిహారిక. టాలెంట్‌ ఉన్న ఎంతోమందికి కేరాఫ్‌ అడ్రస్‌గా పింక్‌ ఎలిఫెంట్‌ సంస్థ మారింది. అందుకే ఆమెను నేను టాలీవుడ్‌ బంగారం అంటుంటాను. మా సినిమాలో నటించిన నటులందరికి ఎంతో మంచి పేరు వస్తుంది’’ అన్నారు.

Advertisement

Next Story