నెహ్రూ చిత్తశుద్ధితో రాజ్యసభకు అధికారం ఇచ్చారు: మల్లిఖార్జున్ ఖర్గే

by Harish |
నెహ్రూ చిత్తశుద్ధితో రాజ్యసభకు అధికారం ఇచ్చారు: మల్లిఖార్జున్ ఖర్గే
X

న్యూఢిల్లీ: భారత మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ రాజ్యసభకుచిత్తశుద్ధితో అధికారం ఇచ్చారని విపక్ష నేత మల్లిఖార్జున్ ఖర్గే అన్నారు. త్వరలోనే పదవీ విరమణ చేయనున్న 72 మంది ఎంపీలనుద్దేశించి గురువారం ఆయన ప్రసంగించారు. 'రాజకీయాల్లో ఎత్తుపల్లాలు ఉన్నప్పటికీ, నేల విడిచి వెళ్లకూడదు. మేము ప్రజల కోసం పని చేసేటప్పుడు దీన్ని దృష్టిలో పెట్టుకుంటాం అని అన్నారు. ఏది ఏమైనప్పటికీ సభను సమర్థవంతంగా నిర్వహించడమే ప్రధానమని కాంగ్రెస్ నేత ఉద్ఘాటించారు. రాజ్యసభ శాశ్వతం కొందరు పదవీ విరమణ పొందితే మరికొందరు వస్తారు. ఇది కొనసాగుతూనే ఉంటుంది. మేము అభిప్రాయ బేధాలను కలిగి ఉన్నప్పటికీ, సమర్ధవంతంగా పనిచేస్తున్నామని నిర్ధారించుకోవాలి' అని తెలిపారు.

నెహ్రూ రాజ్యసభకు అధికారాన్ని ఇచ్చారని మల్లిఖార్జున్ ఖర్గే చెప్పారు. కొన్ని ద్రవ్య బిల్లులు తప్ప ఇరుసభలకు సమాన అధికారాలు ఇచ్చారని తెలిపారు. ఇక, మార్చి-జూలై మధ్య కాలంలో రాజ్యసభ నుంచి 72 మంది ఎంపీలు పదవీ విరమణ పొందనున్నారు. కాగా, వీరిలో 27 మంది రెండు సార్లు రాజ్యసభ కు పనిచేసిన అనుభవం కలిగి ఉన్నారు. మరో 45 మంది కేవలం ఒకసారి మాత్రమే రాజ్యసభలో సేవలందించారు. అంతేకాకుండా మొత్తం 65 మంది 19 రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండగా, ఏడుగురు నామినేటెడ్ గా ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed