భర్త మరణంతో ఇన్నాళ్లు జీవచ్చవంలా బతికాను.. సీనియర్ నటి

by Manoj |
భర్త మరణంతో ఇన్నాళ్లు జీవచ్చవంలా బతికాను.. సీనియర్ నటి
X

దిశ, సినిమా: కొత్త పెళ్లి కొడుకు రణబీర్ కపూర్ తల్లి నీతూ కపూర్ ఇటీవల వరుసగా వార్తల్లో నిలుస్తోంది. భర్త రిషి కపూర్ మరణంతో నటనకు దూరమైన ఆమె దాదాపు 4 దశాబ్దాల తర్వాత కరణ్ జోహార్ నిర్మిస్తున్న 'జుగ్ జుగ్ జీయో' సినిమాతో రీఎంట్రీకి సిద్ధమైంది. ఈ సందర్భంగా ఓ మీడియా సమావేశంలో పాల్గొన్న నీతు.. భర్త మరణంతో ఇంతకాలం ఆనందానికి దూరమైన తన ముఖంలో కరణ్, రణబీర్ మళ్లీ నవ్వులు పూయించారని చెప్పింది.

ఈ సినిమాకు ముందు తన కొడుకు మళ్లీ యాక్టింగ్ చేయాలని పట్టుబట్టాడన్న నటి.. మరుసటి రోజే స్క్రిప్ట్‌తో వస్తానని చెప్పి రాజ్‌తో కలిసి ఇంటికి వచ్చాడని, కథ బాగుండటంతో తాను వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిపింది. అలాగే ఇన్నేళ్ల గ్యాప్ తర్వాత పవర్‌ఫుల్ స్టోరీలో భాగమవడం ఆనందంగా ఉందన్న ఆమె సినిమా తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుందని చెప్పింది. ఇక తన కొడుకు తీయబోయే సినిమాలపై సందేహలుంటే తన ఒపీనియన్ అడుగుతాడని.. 'బ్రహ్మస్త' కోసం రణబీర్, ఆలియా తన సలహాలు తీసుకున్నట్లు చెప్పుకొచ్చింది సీనియర్ నటి.

Advertisement

Next Story