- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Draupadi Murmu: మోడీ సమక్షంలో ద్రౌపది ముర్ము నామినేషన్ దాఖలు
న్యూఢిల్లీ: NDA Presidential Candidate Draupadi Murmu Files Nomination in the Presece Of PM Modi| ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్ము బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ తరుఫున రాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. శుక్రవారం ఒడిశా భవన్ నుంచి పార్లమెంటు చేరుకున్న ఆమె నామినేషన్ పత్రాలు సమర్పించారు. ప్రధాని మోడీ, కేంద్రమంత్రులు రాజ్ నాథ్ సింగ్ , అమిత్ షా సమక్షంలో ఆమె నామినేషన్ పత్రాలను అధికారులకు అంద జేశారు. ఈ మేరకు ద్రౌపదిని రాష్ట్రపతి అభ్యర్థిగా మోడీ మొదట ప్రతిపాదించగా, రెండో వ్యక్తిగా కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్, అమిత్ షా, బీజేపీ జాతీయ అద్యక్షుడు ప్రతిపాదిస్తూ నామినేషన్ పత్రాలపై సంతకం చేశారు.
ఈ సందర్భంగా నాలుగు సెట్ల నామినేషన్ అధికారులు అందజేశారు. మోడీతో పాటు 50 మంది ఎలక్టోరల్ కాలేజ్ సభ్యులు ద్రౌపదిని ప్రతిపాదిస్తూ సంతకాలు చేశారు. బీజేపీ ఎంపీలు, మిత్రపక్షాల ఎంపీలు కూడా మద్దతు తెలిపారు. వీరిలో బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు యోగీ ఆదిత్యనాథ్, బసవరాజ్ బొమ్మై, మనోహర్ లాల్ ఖట్టర్‌తో పాటు ఎంపీలు వైఎస్సార్సీపీ నేత విజయసాయిరెడ్డి, అన్నాడీఎంకే నేత పన్నీరుసెల్వం, తంబిదురై కూడా ఉన్నారు. నామినేషన్ దాఖలు చేసే ముందు పార్లమెంటు ప్రాంగణంలోని గాంధీ, అంబేడ్కర్, బిర్సా ముండా విగ్రహాలకు నివాళులు ఆర్పించారు. అంతకుముందు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి కాల్ చేసి ద్రౌపది తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. జార్ఖండ్ మాజీ గవర్నర్ అయిన ముర్ము దేశ చరిత్రలో తొలిసారిగా అత్యున్నత పదవికి నామినేషన్ వేసిన తొలి ఆదివాసీ మహిళగా నిలిచారు. వచ్చే నెల 18న రాష్ట్రపతి ఎన్నికలు జరగనుండగా, ఒకవేళ గెలిస్తే రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన రెండో మహిళగా నిలవనున్నారు.
- Tags
- Draupadi Murmu