- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొవిడ్ నిబంధనలు ఎత్తివేసిన రాష్ట్ర హోంశాఖ
కోహిమా: దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో నాగాలాండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శుక్రవారం నుంచి అన్ని కొవిడ్ నిబంధనలు ఎత్తివేస్తున్నట్లు రాష్ట్ర హోం శాఖ ప్రకటించింది. ఇకపై వేడుకలకు హాజరయ్యే వారి సంఖ్య పై ఎలాంటి పరిమితి లేదని పేర్కొంది. అంతేకాకుండా నాగాలాండ్ వచ్చే పర్యాటకులపై కూడా ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు తెలిపింది. గత రెండేళ్లుగా పర్యాటకులపై ఆంక్షలను కొనసాగిస్తూ వస్తుంది. అయితే ప్రజల స్వీయ నియంత్రణ, మాస్క్ ధరించడం, జన సమూహాల్లో భౌతిక దూరం పాటించాలని నాగాలాండ్ ప్రధాన కార్యదర్శి జే ఆలాం తెలిపారు. నాగాలాండ్‌లో మే 2020న తొలి కరోనా కేసు వెలుగు చూసింది. 12 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారికి కరోనా టీకాలు వేయవలసిందిగా సూచించారు. ముందు జాగ్రత్తగా డోస్ ఇవ్వాల్సిన వ్యక్తులు వీలైనంత త్వరగా టీకాలు వేయించుకోవాలని కోరారు. ఇక తాజాగా నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య కూడా రెండంకెలలో ఉన్నట్లు పేర్కొంది.