Naga Chaitanya: సమంతతో డివోర్స్.. మరో నటితో చైతూ డేటింగ్..?

by Manoj |   ( Updated:2022-06-20 10:35:53.0  )
Naga Chaitanya Dating With Sobhita Dhulipala After Split From Samantha
X

దిశ, సినిమా : Naga Chaitanya Dating With Sobhita Dhulipala After Split From Samantha| టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్య మళ్లీ ప్రేమలో పడ్డట్లు తెలుస్తోంది. 2021 అక్టోబర్‌లో సమంతతో విడాకులు తీసుకున్న చై.. తాజాగా మరో హీరోయిన్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నట్లు సోషల్ మీడియా కోడై కూస్తోంది. విషయానికొస్తే.. ఇంతకాలం బ్యాచిలర్ లైఫ్ ఎంజాయ్ చేసిన చైతన్య ఇటీవల 'మేడ్ ఇన్ హెవెన్' ఫేమ్ శోభిత ధూళిపాలతో డేటింగ్ చేస్తున్నట్లు సినీ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఈ మధ్యనే హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో కొత్త ఇల్లు కొనుగోలు చేసిన హీరో.. ఆ ఇంట్లోకి శోభితనే మొదటిసారి తీసుకెళ్లడంతో పాటు ఎక్కువ సమయం అక్కడే గడుపుతున్నట్లు సన్నిహిత వర్గాల సమాచారం.

ఇక నూతన గృహం నుంచి బయటకొచ్చిన ఇద్దరూ ఒకే కారులో బయటకెళ్లినట్లు సాక్ష్యాలు కూడా ఉన్నాయంటూ నెట్టింట రచ్చ మొదలు పెట్టారు. అంతేకాదు శోభిత 'మేజర్' చిత్ర ప్రమోషన్స్‌లో పాల్గొనేందుకు వచ్చినపుడు ఓ ప్రముఖ హోటల్‌లో స్టే చేసిందని, అక్కడ చైతు కూడా కనిపించాడంటున్న నెటిజన్లు.. ఆమె పుట్టినరోజు వేడుకలు కూడా చైతుతోనే జరుపుకుందని అంటున్నారు. ఇక దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోగా కొంతమంది వారిద్దరూ మంచి స్నేహితులని చెబుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed