- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చంద్రుడిపైన గుర్తుతెలియని స్పేస్‌క్రాఫ్ట్.. ఏలియన్లదేనా..?!
దిశ, వెబ్‌డెస్క్ః అంతరిక్షంలో గ్రహాంతరవాసుల ఉనికి ఉందన్న సంగతి కేవలం ఊహాగానాలకు మాత్రమే పరిమితం అవ్వలేదు. అంతరిక్ష పరిశోధనల్లో అభివృద్ధి మేరుగవుతున్న కొద్దీ ఏలియన్ల ఎరుక మరింత పెరుగుతోంది. అయితే, ఏలియన్లు మనుషుల కంటే సాంకేతికంగా మరింత అభివృద్ధిని సాధించారా, చాలా తెలివిగలవారా అనే విషయంలో స్పష్టమైన ఆధారాలు లభ్యం కానప్పటికీ, ఆకాశంలో గుర్తుతెలియని సాసర్లు, స్పేస్ క్రాఫ్ట్‌ల వదంతుల్లో అసలు నిజం లేదు అనడానికి లేదు. ఎందుకంటే, చంద్రుడిపై ఓ మిస్టరీ స్పేస్‌క్రాఫ్ట్ క్రాష్ కారణంగా ఏర్పడిన డబుల్ క్రేటర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. చంద్రునిపై ఇటీవల గుర్తించిన ఈ బిలం సైంటిస్టులను అలర్ట్ చేసింది. దీనికి సంబంధించి, తూర్పు బిలం 59 అడుగులు (18 మీటర్లు), పశ్చిమ బిలం 52.5 అడుగులు (16 మీటర్లు) కొలతలతో ఉంది.
ఇక, గత ఏడాది చంద్రుడిపై గుర్తుతెలియని అంతరిక్ష వ్యర్థం కూలిపోయిందని, దాని కారణంగా ఒక బిలం ఏర్పడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. అయితే ఇక్కడ ఆసక్తి రేకెత్తించే విషయం ఏంటంటే, ఇంతకు ముందు జరిగిన ఏ అంతరిక్ష వ్యర్థాల క్రాష్ ఇలా రెండు క్రేటర్‌లను ఏర్పరచలేదు. అందుకే, ఈ డబుల్ క్రేటర్ ఊహకందనిదిగా ఉందని నాసా తెలిపింది. అయితే, దీన్ని పూర్తిగా పరిశీలించిన తర్వాత గానీ, ఈ గుర్తు తెలియని బిలాలు అంతరిక్ష నౌకల్లో దేనికి సంబంధించినవో, ఏలియన్లకు సంబంధించిన ఏదైనా సమాచారాన్ని అందిస్తాయో లేదోనని వేచి చూడాలంటున్నారు పరిశోధకులు.