Mrunal Thakur: రాజకుమారిలా ముస్తాబైన మృణాల్ ఠాకూర్ .. నెటిజన్ల రియాక్షన్ ఏంటంటే?

by Hamsa |
Mrunal Thakur: రాజకుమారిలా ముస్తాబైన మృణాల్ ఠాకూర్ .. నెటిజన్ల రియాక్షన్ ఏంటంటే?
X

దిశ, సినిమా: యంగ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) ‘సీతారామం’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అదే ఫామ్‌లో వరుస చిత్రాల్లో ఆఫర్ అందుకుంది. ఇక నాని ‘హయ్ నాన్న’(Hi Nanna ) మూవీతో విజయం సాధించి అందరినీ ఫిదా చేసింది. ఆ తర్వాత ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘కల్కి ఏడి 2898’(KalkiAD2898) మూవీలో కీలక పాత్రలో నటించి మెప్పించింది. ప్రజెంట్ ఈ అమ్మడుకి తెలుగులో పెద్దగా ఆఫర్లు రాకపోవడంతో బాలీవుడ్ ఇండస్ట్రీకి చెక్కేసింది.

అక్కడ పూజా మేరీ జాన్, హాయ్ జవానీ తో ఇష్క్ హోనా హే(Hi Jawani To Ishq Hona Hey), సన్ ఆఫ్ సర్దార్-2(Son of Sardar-2), తుమ్ హో తో వంటి చిత్రాల్లో నటిస్తోంది. అలాగే సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ పలు ఫొటోలు షేర్ చేస్తూ అభిమానులను మంత్రముగ్దులను చేస్తోంది. తాజాగా, మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కొన్ని ఫొటోలు షేర్ చేసి అందరిని ఫిదా అయ్యేలా చేసింది. బ్లాక్ కలర్ డ్రెస్ ధరించిన ఆమె రాజకుమారిలా ముస్తాబై ఓర చూపులు చూస్తోంది. ఇక ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు గార్జియస్ లుక్(Gorgeous Look) అని ఫైర్ ఎమోజీలను షేర్ చేస్తున్నారు.

Advertisement

Next Story