- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నెల్లూరు-తడ హైవేను 6 లేన్లకు మార్చేది ఎప్పుడు? లోక్ సభలో ఎంపీ
by Vinod kumar |
X
దిశ, ఏపీ బ్యూరో: నెల్లూరు- తడ హైవేను 4 నుంచి 6 లేన్లకు ఎప్పుడు మారుస్తారని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గురువారం లోక్‌సభలో ప్రశ్నించారు. ఇప్పటివరకు దీనికోసం ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరణ ఇవ్వాలని కోరారు. అంతేకాదు ఈ నిర్మాణానికి ఎంతకాలం పడుతుందని కూడా ప్రశ్నించారు. ఎంపీ ఆదాల ప్రశ్నకు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు.
నెల్లూరు నుంచి తడ వరకు ఉన్న 16వ జాతీయ రహదారిని నిర్మించి నిర్వహించే ప్రాతిపదికన 2031 వరకు అప్పగించామని వెల్లడించారు. దీనికి పూర్తి స్థాయిలో ఒక ఆకృతిని ఇచ్చి, నిర్వహించే గడువు 2031 వరకు ఉందని పేర్కొన్నారు. అందువల్ల అప్పటివరకు దీనిని విస్తరించే అవకాశం లేదని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు.
Advertisement
Next Story