మాలీవుడ్ యువ నటుడు అనుమానాస్పద మృతి

by srinivas |
మాలీవుడ్ యువ నటుడు అనుమానాస్పద మృతి
X

దిశ, సినిమా : మలయాళ సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. 'ఒరు మెక్సికన్','సీఐఏ కామ్రేడ్ ఇన్ అమెరికా' వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న యువ నటుడు శరత్ చంద్రన్(37) కొచ్చిలోని తన నివాసంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. దీంతో మాలీవుడ్‌లో ఒక్కసారిగా విషాదం ఛాయలు అలుముకున్నాయి. ఈ మేరకు సినీ ప్రముఖులు శరత్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కాగా 'అనిస్య' చిత్రం ద్వారా సినీ అరంగేట్రం చేసిన శరత్.. లిజో జోస్ పెల్లిస్సేరి సినిమా 'అంగమలీ డైరీస్‌'లో కీలక పాత్ర పోషించాడు.

Advertisement

Next Story