'మొల్లమాంబ అడుగు జాడల్లో నడుద్దాం'

by S Gopi |
మొల్లమాంబ అడుగు జాడల్లో నడుద్దాం
X

దిశ, యాచారం: మొల్లమాంబ అడుగు జాడల్లో నడవాలని కుమ్మర సంఘం మండల అధ్యక్షుడు కొండాపురం శ్రీశైలం అన్నారు. శ్రీశైలం ఆధ్వర్యంలో మొల్లమాంబ జయంతి ఉత్సవాలను ఆదివారం మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఆమె చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీశైలం మాట్లాడుతూ.. మొల్ల తెలుగు తొలి మహిళా కవయిత్రి అని, మొల్ల కుమ్మర కులంలో జన్మించడం కుమ్మరుల అదృష్టంగా భావిస్తున్నామన్నారు. చేతి వృత్తులలో భాగమైన కుమ్మర చేతి వృత్తిని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని, ఆర్థికంగా సాయం అందించాలని అన్నారు. అనంతరం కుమ్మర సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు ఆడాల గణేష్ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద మొల్ల చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో యాచారం మండల ప్రధాన కార్యదర్శి బత్తుల లక్ష్మణ్, కాసుల కిష్ణ, కాకులారం దాసు, నడికుడి చంద్రయ్య, చిలుకూరి భాష, జాపాల శ్రీనివాస్, కొండాపురం మల్లేష్, భాస్కర్, కృష్ణ, కుమ్మర సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story