నేను కాస్టింగ్ కౌచ్ బాధితురాలినే.. మంచు లక్ష్మి

by Harish |   ( Updated:2022-03-09 12:47:40.0  )
నేను కాస్టింగ్ కౌచ్ బాధితురాలినే.. మంచు లక్ష్మి
X

దిశ, సినిమా: సీనియర్ హీరో మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మీ వ్యక్తిత్వం, ధైర్యం గురించి అందరికీ తెలిసిందే. అయితే పవర్ లేడీగా పేరుగాంచిన స్టార్ కూతురు తాను ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్‌, బాడీ షేమింగ్ సమస్యలు ఎదుర్కొన్నానంటోంది. ఈ మేరకు ఇటీవల ఓ ప్రముఖ చానెల్‌తో మాట్లాడిన ఆమె.. తన కెరీర్‌లో సెక్సిజం, కాస్టింగ్ కౌచ్‌ని ఎదుర్కొన్న పరిస్థితుల గురించి వివరించింది. 'ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలకు ఈ సమస్య ఏదో రూపంలో ఎదురవుతూనే ఉంది. ఇల్లు, ఆఫీసు, ఇండస్ట్రీ ఎక్కడపడితే అక్కడే కొంతమంది పురుషులు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. నా తండ్రి స్టార్ అయినా నేను ఓ సందర్భంలో లైంగిక వేధింపుల సమస్యను ఎదుర్కొన్నాను' అని చెప్పుకొచ్చిన లక్ష్మి.. బాడీ షేమింగ్ గురించి కూడా మాట్లాడింది. శరీరం సైజు అనేది మానవ సమాజాన్ని చాలా ప్రభావితం చేసిందంటూ.. రోజురోజుకు పెరుగుతున్న ఈ సమస్య పై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందంటూ ఆవేదన వ్యక్తం చేసింది.


16 ఏళ్లకే బ్రెస్ట్ సర్జరీ చేయించుకున్న.. హాట్ బ్యూటీ

Advertisement

Next Story