16 ఏళ్లకే బ్రెస్ట్ సర్జరీ చేయించుకున్న.. హాట్ బ్యూటీ

by Disha Web Desk 17 |
16 ఏళ్లకే బ్రెస్ట్ సర్జరీ చేయించుకున్న.. హాట్ బ్యూటీ
X

దిశ, సినిమా: బాలీవుడ్ హాట్ బ్యూటీ రాఖీ సావంత్ నిరంతరం ఏదో వివాదంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. అయితే వివాదాలే కాదు తన జీవితంలో కొన్ని బాధాకరమైన సంఘటనలు ఎదుర్కోవాల్సి వచ్చిందంటోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాఖీ.. తన అందం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. 'నాకు సినిమాలు అంటే చాలా ఇష్టం. ఇండస్ట్రీలో స్థిరపడేందుకు ఎన్నో కష్టాలు పడ్డాను. 16 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడు హీరోయిన్ అవ్వాలంటే బాడీ షేప్ కొన్ని కొలతల్లో ఉండాలన్నారు. ముఖం కూడా అందంగా ఉండాలన్నారు. అప్పుడే అవకాశాలిస్తారు అంటూ భయాందోళనకు గురిచేసారు. దీంతో నా బ్రెస్ట్ షేప్ కోసం సర్జరీ చేయించుకున్నాను' అంటూ చెప్పుకొచ్చిన నటి.. అది చాలా భయంకరమైన అనుభవమని, అభిమానులను సంపాదించుకోవడం అనుకున్నంత ఈజీ కాదని తెలిపింది.



Next Story

Most Viewed