ప్రధానిగా మోదీ ఉన్నారా? అదానీ ఉన్నారా? : ఎమ్మెల్సీ కవిత

by Nagaya |
ప్రధానిగా మోదీ ఉన్నారా? అదానీ ఉన్నారా? : ఎమ్మెల్సీ కవిత
X

దిశ, తెలంగాణ బ్యూరో : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్‌ సంస్థలకు తొత్తుగా వ్యవహరిసుందని, మోడీ ప్రభుత్వరంగ సంస్థలను అదానీకి కట్టబెడుతున్నారని, అసలు దేశానికి ప్రధానిగా మోదీ ఉన్నారా? అదానీ ఉన్నారా? అనే అనుమానం కలుగుతుందని ఎమ్మెల్సీ కవిత విమర్శలు చేశారు. ఆటా మహాసభల్లో భాగంగా సోమవారం టీఆర్ఎస్ యూఎస్ఏ ఆధ్వర్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, చైర్మన్లతో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ రైతులు, పేదలు రెండు కండ్లుగా సంక్షేమ పాలన అందిస్తూ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్‌ వన్‌గా నిలిపిన దార్శనికుడు కేసీఆర్‌ అన్నారు. దేశానికి రోల్‌ మోడల్‌గా తెలంగాణ అని స్పష్టం చేశారు. కరెంట్‌ కోతలు, తాగునీటి వేతలు, వలసలు అసలే లేవన్నారు.

బీజేపీకి ఒక విధానం, నినాదం లేదని.. కేవలం విద్వేశాలను రెచ్చగొట్టమే వాళ్ల ఎజెండా అని విమర్శించారు. కశ్మీర్‌లో మత రాజకీయం అన్నిచోట్లా విద్వేష రాజకీయాలు చేస్తున్నదని మండిపడ్డారు. ఆరు దశాబ్దాలుగా దేశాన్ని నాశనం చేసిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం దిక్కు లేకుండాపోయిందన్నారు. దేశాన్ని గడిచిన ఎనిమిదేండ్లుగా సాగుతున్న మోదీ పాలనలో దారిద్య్రం మరింత పెరిగి పోయిందని విమర్శించారు. బీజేపీ పాలనలో తెలంగాణకు పెద్దగా ఒరిగిన ప్రయోజనం ఏమీ లేదన్నారు. యావత్ భారత్‌ కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటుందన్నారు.

ఈ కార్యక్రమానికి మంత్రులు ఎర్రబెల్లి ద‌యాక‌ర్ రావు, చామ‌కూరి మ‌ల్లారెడ్డి, ఎమ్మెల్యేలు కాలే యాదయ్య, గాద‌రి కిషోర్‌, చ‌ల్లా ధ‌ర్మారెడ్డి, గువ్వల బాలరాజు , చంటి క్రాంతి కిర‌ణ్‌, బొల్లం మల్లయ్య, టీఆర్ఎస్ ఎన్నారై కో-ఆర్డినేటర్ మహేష్ బిగాల, యూఎస్ఏ టీఆర్ఎస్ సభ్యులు పూర్ణ బైరి, నరసింహారావు నాగులవంచా, అనిల్, ఎర్రబెల్లి , రవి ధన్నపనేని, సక్రు నాయక్ , నవీన్ జలగం, తెలంగాణ జాగృతి సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed