సీఎం ఎవరైనా సరే.. ముందు దానిపైనే సంతకం చేపిస్తా: జీవన్ రెడ్డి

by GSrikanth |   ( Updated:2022-03-30 10:47:27.0  )
సీఎం ఎవరైనా సరే.. ముందు దానిపైనే సంతకం చేపిస్తా: జీవన్ రెడ్డి
X

దిశ, జగిత్యాల టౌన్: వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి ఎవరైనా సరే ముందు ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని ఓపెన్ చేసేందుకు సంతకం చేయిస్తానని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. బుధవారం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రైతుల బాధలు దృష్టిలో ఉంచుకొని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యతలను గుర్తు చేయడానికి రాహుల్ గాంధీ ట్వీట్ చేస్తే టీఆర్ఎస్ నాయకులకు అంత ఇబ్బంది ఎందుకని ప్రశ్నించారు. ధాన్యం కొనుగోలు విషయంలో ఏ రాష్ట్రంలో రాని సమస్యను తెలంగాణలో ఎందుకు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రం ఏర్పడి ఏడు సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ కాంగ్రెస్ చేసిన అభివృద్ధి మాత్రమే కనిపిస్తున్నదని తెలిపారు. ఫుడ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి రైతులకు ఆదుకున్న ఘనత కాంగ్రెస్ పార్టీదన్నారు. ఉచిత విద్యుత్‌ను తెరమీదికి తెచ్చింది ఎవరు అని మంత్రి హరీశ్ రావును ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో ఉచిత విద్యుత్‌పై వైఎస్ఆర్ తొలి సంతకం చేశారని, గ్రామ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని గుర్తుచేశారు.

Advertisement

Next Story