మునుగోడు ఉప ఎన్నిక తర్వాత జరిగేది ఇదే: Raghunandan Rao

by GSrikanth |   ( Updated:2022-08-03 10:54:51.0  )
MLA Raghunandan Rao Slams out at TPCC Chief Revanth Reddy
X

దిశ, వెబ్‌డెస్క్: MLA Raghunandan Rao Slams out at TPCC Chief Revanth Reddy| టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి అడుగుపెట్టిన పార్టీ పూర్తిగా అంతం అవుతుందని అన్నారు. తెలంగాణలో టీడీపీ పరిస్థితి ఏమైందో.. కాంగ్రెస్‌కూ అదే గతి పట్టబోతోందని జోస్యం చెప్పారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి రేవంత్ రెడ్డి ఏజెంట్ అని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డికి పీసీసీ పదవి ఎలా వచ్చిందో అందరికీ తెలుసని తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని ఒకప్పుడు బలిదేవత అన్న రేవంత్ రెడ్డి, ఇవాళ తెలంగాణ తల్లి అంటున్నాడని ఎద్దేవా చేశారు. అసలు బలిదేవత తల్లి ఎలా అవుతుందని ప్రశ్నించారు. మునుగోడు ఉప ఎన్నిక తర్వాత కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలు ఖాళీ అవ్వడం ఖాయమని అన్నారు.

ఇది కూడా చదవండి:

హుజూరాబాద్‌లో హోర్డింగ్‌ల కలకలం.. ఈటల వర్సెస్ కౌశిక్ రెడ్డి

Advertisement

Next Story