బంజారాల అభివృద్ధికి కృషి: ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి

by Web Desk |
బంజారాల అభివృద్ధికి కృషి: ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి
X

దిశ, రామాయంపేట: నిజాంపేట మండలంలోని నగరం తండాలో నూతనంగా నిర్మించిన సేవాలాల్, జగదాంబ మాత విగ్రహా ప్రతిష్ట కార్యక్రమానికి ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బంజారాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. మెదక్ జిల్లా కేంద్రంలో బంజారాలకు ఒక ఎకరం స్థలం కేటాయించామన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ సిద్ధిరాములు, గ్రామ సర్పంచ్ గేమ్ సింగ్, ఎంపీటీసీ లలితా రవి, తదితరులు పాల్గొన్నారు.

మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే..




రామాయంపేట పట్టణం సిద్దిపేట రోడ్డులో ఆటో బైక్ ఢీ కొన్నాయి. అదే రోడ్డులో నిజాంపేట పర్యటన ముగించుకుని మెదక్ కు వెళ్తున్న ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని తన సొంత వాహనంలో రామాయంపేట లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Next Story