పొట్టి శ్రీరాములును చంద్రబాబు అవమానించారు: మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు

by Vinod kumar |
పొట్టి శ్రీరాములును చంద్రబాబు అవమానించారు: మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు
X

విజయవాడ: అమరజీవి పొట్టి శ్రీరాములును టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అవమానించారని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆరోపించారు. విజయవాడలోని సామరంగ్ చౌక్‌ దగ్గర అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి మంత్రి వెల్లంపల్లి పూలమాలలు వేసి నివాళులర్పించారు.


ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు ఆద్యుడు, ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు అని కొనియాడారు. నాటి సీఎం వైఎస్ఆర్ నెల్లూరు జిల్లా పొట్టి శ్రీరాములు జిల్లాగా పేరు పెట్టి గౌరవించారని గుర్తు చేశారు.


నేటి సీఎం వైఎస్ జగన్ పొట్టి శ్రీరాములు జయంతి వర్ధంతి కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా చేయాలని..ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం కూడా చేయాలని ఆదేశించారని తెలిపారు. పొట్టి శ్రీరాములు త్యాగ ఫలితంగా వచ్చిన ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం అయిన నవంబర్ ఒకటిని చంద్రబాబు గాలికీ వదిలేశారని గుర్తు చేశారు.


టీడీపీ హయాంలో తొలగించిన పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని కొద్దీ రోజులలోనే నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఐ కమిషనర్ రేపాల శ్రీనివాస్, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్, ఆర్యవైశ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed