సికింద్రాబాద్‌లో సూప‌ర్ స్పీడ్‌తో 2 రైళ్లు... ఒక‌దాన్లో రైల్వే మంత్రి, మ‌రోదాన్లో ఛైర్మ‌న్ ఉన్నారు..?!

by Manoj |   ( Updated:2022-03-04 08:07:22.0  )
సికింద్రాబాద్‌లో సూప‌ర్ స్పీడ్‌తో 2 రైళ్లు... ఒక‌దాన్లో రైల్వే మంత్రి, మ‌రోదాన్లో ఛైర్మ‌న్ ఉన్నారు..?!
X

దిశ‌, వెబ్‌డెస్క్ః మార్చి 4న సికింద్రాబాద్‌లో రెండు రైళ్లు చాలా స్టీడ్‌గా ఒకదాని ఎదురుగా ఒక‌టి దూసుకొస్తున్నాయి. ఒక రైల్‌లో రైల్వే మంత్రి ఉండ‌గా, మరో రైల్లో రైల్వే బోర్డు చైర్మన్ ఉన్నారు. సిబ్బంది అంతా అప్ర‌మ‌త్తంగా ఉన్నారు. ఆ రెండు రైళ్లు గుద్దుకుంటే అల్ల‌క‌ల్లోల‌మే... అయితే, 'క‌వ‌చ్' కారణంగా రెండు రైళ్లు ఢీకొట్టుకోలేదు. హ‌మ్మ‌య్యా..!! ప్రాజెక్ట్ స‌క్సెస్ అయ్యింది. 'కవచ్‌' అనేది ప్రపంచంలోనే అత్యంత చౌకైన 'ఆటోమేటిక్ ట్రైన్ కొల్లీష‌న్ ప్రొటెక్ష‌న్ సిస్ట‌మ్‌', అంటే, రెండు రైళ్లు ఎదురెదురుగా, వాటి గ‌రిష్ట వేగంతో వ‌స్తున్న‌ప్పుడు ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా, ప్ర‌మాదం జ‌ర‌గ‌కుండా ర‌క్ష‌ణ‌గా వినియోగించే ఒక వ్య‌వ‌స్థ‌. లోకో పైలట్ విఫ‌ల‌మైన‌ప్పుడు ఆటోమేటిక్ బ్రేక్‌ల అప్లికేషన్ ద్వారా 'కవాచ్' రైలు వేగాన్ని నియంత్రిస్తుంది. అలాగే, సిస్టమ్ యాక్టివేట్ అయిన తర్వాత, 5-కిమీ పరిధిలో ఉన్న అన్ని రైళ్లు రక్షణ కల్పించేందుకు పక్కనే ఉన్న ట్రాక్‌లపై ఆగిపోతాయి.

ఇండియాలోనే అభివృద్ధి చేసిన ఈ ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ (ATP) వ్యవస్థను రైల్వేలు "జీరో యాక్సిడెంట్‌" లక్ష్యాన్ని సాధించడం కోసం రూపొందించారు. 'క‌వ‌చ్' ఎలా ప‌నిచేస్తుందంటే, నిర్ణీత దూరంలో అదే లైన్‌లో మరొక రైలును గమనించినప్పుడు స్వయంచాలకంగా రైలును నిలిపివేసేలా రూపొందించబడింది. దీని ద్వారా, రెడ్ సిగ్నల్ జంపింగ్, మరేదైనా సాంకేతి, మాన్యువల్ లోపాన్ని డిజిటల్ సిస్టమ్ గమనించినప్పుడు రైళ్లు కూడా వాటంతట అవే ఆగిపోతాయి. ఇది ఒకసారి అమలులోకి వస్తే, ప్ర‌స్తుతం ప్రపంచవ్యాప్తంగా దీనికి రూ. 2 కోట్లు ఖ‌ర్చు చేస్తుంటే దీనితో రూ. 50 లక్షలు మాత్ర‌మే ఖర్చు అవుతుందని అధికారులు చెబుతున్నారు. సనత్‌నగర్-శంకర్‌పల్లి సెక్షన్‌కు చెందిన‌ సిస్టమ్‌పై ఈ ట్రయల్ నిర్వ‌హించారు. ఇందులో భాగంగా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సికింద్రాబాద్‌కు వ‌చ్చారు. మార్చి 4న ఈ ట్రయల్‌లో రైల్వే మంత్రి, రైల్వే బోర్డు ఛైర్మన్ పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed