- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీజేపీ చేసింది సున్నా.. మన రాష్ట్రం దేశానికే ఆదర్శం: మంత్రి హరీష్ రావు
దిశ, సిద్దిపేట: సిద్దిపేట అర్బన్ మండల నాయకుల సమావేశంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సిద్దిపేట అర్బన్ మండలం కలిసి కట్టుగా టీమ్ వర్క్ గా పని చేయాలని కోరారు. తెలంగాణ వచ్చాక టీఆర్‌ఎస్ ప్రభుత్వం పేదల కోసం అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నామని, ఏమీ చేయకుండానే బీజేపీ సోషల్ మీడియా ఫేక్ ప్రచారాన్ని తిప్పి కొట్టాలని కోరారు. రైతులకు ఇచ్చే అన్నీ సబ్సిడీలు తగ్గించి రైతులకు భద్రత లేకుండా చేసిందని కేంద్ర బీజేపీ తీరుపై మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఎరువుల ధరలు పెంచినట్లు వాపోయారు. కొత్త బడ్జెట్‌లో రాష్ట్రానికి ఇచ్చే సబ్సిడీపై కోత విధించిందని వెల్లడించారు.
కేంద్ర ప్రభుత్వం రైతులపై భారం వేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రతీ యేటా జీఎస్‌డీపీలో 4 శాతం అప్పు రూపేణా తీసుకునే అనుమతి, అవకాశం ఉండేదని, కానీ ఇప్పుడు 3.5 శాతం ఎప్పటిలాగే తీసుకోవచ్చునని, ఒక అర శాతానికి మెలిక పెట్టిందని విద్యుత్తు చట్టంలో సవరణలు చేయాలన్నారు.
బాయిల వద్ద విద్యుత్ మీటర్లు పెట్టాలని, బాయిల వద్ద మీటర్లు పెడితే అర శాతం మీ రాష్ట్రానికి అప్పు తీసుకునేందుకు అనుమతి ఇస్తామని.. మెలిక పెట్టిందన్నారు. దీనికి ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు సంక్షేమమే ధ్యేయంగా తన గొంతులో ప్రాణం ఉన్నంత వరకూ మీటర్లు పెట్టనని తేల్చి చెప్పారని. మీటర్లు వద్దు.. బీజేపీ వద్దు.. మన కేసీఆర్ మనకు ముద్దు అంటూ.. ప్రజాక్షేత్రంలో ప్రజలకు అర్థమయ్యేలా పార్టీ శ్రేణులు వినిపించాలని కోరారు.
బీజేపీ రైతులపై భారం వేస్తుందని, డీజీల్, పెట్రోల్ ధర పెంపు చేస్తుందని, ఎరువుల ధరలు పెరిగి, బాయిల వద్ద మీటర్లు పెట్టి ముక్కుపిండి పైసలు వసూలు చేసే పనిలో పడిందన్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి వడ్లు కొనేది కేంద్రమే.. ఇప్పటికీ ఎన్నో ప్రభుత్వాలు మారాయని.. కానీ ఈ యాసంగిలో వడ్లు కొనమని చెప్పడం బీజేపీ కేంద్రం తీరును అర్థమయ్యేలా వివరించాలని కోరారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికలు ముగియగానే పెట్రోల్, డీజీల్ ధర మరో పది రూపాయలు పెంచుతారని బీజేపీ ప్రభుత్వం పై మండిపడ్డారు. ఈ విషయం పై గ్రామ, వార్డు, మండల స్థాయిలో చర్చలు జరపాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
బట్టేబాజ్, జూటే బాజ్ పార్టీ బీజేపీ అని, గ్రామ క్షేత్రస్థాయిలో ఇప్పటి వరకూ టీఆర్ఎస్ పార్టీ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా ఉన్నాయన్నారు. ఆ పథకాలను ఇప్పటికే కాపీ కొడుతున్నదనే విషయాన్ని ప్రజా క్షేత్రంలో సమగ్రంగా అర్థమయ్యేలా ప్రజలకు వివరించాలని టీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.