- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మెక్సికో సిటీలో పుట్టుకొచ్చిన కొత్త మ్యాగజైన్..
దిశ, ఫీచర్స్ : సెక్స్ వర్కర్స్‌కు జరుగుతున్న అన్యాయాలను ఖండించేందుకు మెక్సికో సిటీలో మ్యాగజైన్ పుట్టుకొచ్చింది. పలోమా పాజ్ అనే సెక్స్ వర్కర్ నేతృత్వంలో ఈ మ్యాగజైన్ స్థాపించబడగా.. ప్రభుత్వం, సమాజం తమను ఏ విధంగా చూస్తుందో గొంతెత్తి చెప్పడమే మ్యాగజైన్ ఉద్దేశమని చెప్తోంది. మహమ్మారి కారణంగా తాము నివసించే, పనిచేసే హోటల్స్ మూసివేయడంతో తోటి సెక్స్ వర్కర్స్ బజారున పడ్డారని, ఆ సంఘటనలు చూసి కథనాలు రాయడం ప్రారంభించానని తెలిపింది.
'నోటికల్లే' పేరుతో ప్రారంభమైన ఫ్రీ మంత్లీ మ్యాగజైన్ కోసం పాజ్‌తో పాటు మరో 10 మంది పని చేస్తుండగా.. ప్రభుత్వేతర సంస్థ 'బ్రగడ కల్లెజెరా' ఈ మాసపత్రికను ప్రచురిస్తోంది. దీన్ని సెక్స్ వర్కర్ల కోసం సెక్స్ వర్కర్లు ఉత్పత్తి చేసే కమ్యూనికేషన్ సాధనంగా అభివర్ణించిన పాజ్.. ప్రతీ నెల దాదాపు వెయ్యి కాపీలు ముద్రించబడుతున్నాయని తెలిపింది. త్రీ లెటర్-సైజ్ పేపర్ షీట్స్‌ను సగానికి మడిచి కలిపి ఉంచబడే మ్యాగజైన్ కవర్‌పై 'నోటికాల్లే' పేరుతో పాటు ఇద్దరు సెక్స్ వర్కర్ల కార్టూన్ ఉంది. ఇందులో 'O' అక్షరం కండోమ్‌గా సూచించబడుతుంది. ఇక కమ్యూనిటీ జర్నలిజం మ్యాగజైన్ బృందంలోని సభ్యులు.. మెక్సికో సిటీలోని సెక్స్ వర్కర్లకు ప్రతి నెలా కాపీలను చేతితో పంపిణీ చేయడం విశేషం.
కాగా ఈ మ్యాగజైన్ ద్వారా ఇతర ఏరియాల్లో ఉండే తమ సహోద్యోగులు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో తెలుసుకోవచ్చని చెప్తున్నారు. ఓ వ్యక్తి హత్య కేసులో నిరపరాధి అయిన ట్రాన్స్‌జెండర్‌కు 14 ఏళ్ల జైలు శిక్ష, సెక్స్ వర్కర్లకు ప్రభుత్వం ఇళ్లు కట్టించడం వంటి అంశాలపై షార్ప్ విజన్‌తో కూడిన కథనాలను మ్యాగజైన్‌లో ప్రచురించారు. అంతేకాదు మరింత మందిని తమ కమ్యూనిటీ జర్నలిజంలో చేర్చుకునేందుకు వర్క్ షాప్స్ నిర్వహిస్తోంది బృందం.