పురుషుల ఓవర్‌కాన్ఫిడెన్స్.. పరిశోధకులు చెప్తున్నదేంటంటే..

by Javid Pasha |
పురుషుల ఓవర్‌కాన్ఫిడెన్స్.. పరిశోధకులు చెప్తున్నదేంటంటే..
X

దిశ, ఫీచర్స్ : శిక్షణ లేదా నైపుణ్యం లేకున్నా ఎక్కువ మంది పురుషులు యూట్యూబ్‌ వీడియోలు చూసి విమానాన్ని సేఫ్‌గా ల్యాండ్ చేయగలమనే అతి విశ్వాసాన్ని ప్రదర్శించారని న్యూజిలాండ్ పరిశోధకులు వెల్లడించారు. వైకాటో యూనివర్సిటీ, సైకాలజీ స్టూడెంట్ కల్యా జోర్డాన్.. తన అధ్యయనంలో భాగంగా 'ఏరోప్లెయిన్ ల్యాండింగ్' టాపిక్‌ను ఎంచుకుంది. ఈ మేరకు కొన్ని పనుల్లో తమ నాలెడ్జ్ జీరో అని తెలిసినా చాలామంది వ్యక్తులు తాము చేయగలమనే ఓవర్‌కాన్ఫిడెన్స్ ప్రదర్శిస్తారని తెలిపింది.

ఈ అధ్యయనంలో 582 వ్యక్తులను వేర్వేరు గ్రూప్స్‌గా విభజించారు. వీరిలో సగం మందికి ఒక పైలట్ ఆకస్మాత్తుగా ఫ్లైట్ నుంచి దిగుతున్న మూడు నిమిషాల వీడియోను చూపించారు. ఉద్దేశపూర్వకంగానే అవసరమైన సమాచారం లేదా ఎలాంటి ట్రైనింగ్ అందించని పనికిరాని వీడియోను ఎంచుకున్నారు. ఇక పైలట్ దిగే సమయంలో కూడా ఆపరేటింగ్‌కు సంబంధించి ఎటువంటి బటన్స్, నాబ్స్ చూపలేదు.

అయితే వీడియోను పరిశీలించాక 89 మందిలో నాలుగోవంతు విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేయగలమని 62% కాన్ఫిడెన్స్‌తో ఉండగా.. వీరిలో సగం మంది 30% నమ్మకంతో ఉన్నారు. 109 మందితో కూడిన మరో గ్రూప్‌లో సగం మంది ఆ వీడియో చూడకుండానే విమానాన్ని సురక్షితంగా ల్యాండింగ్ చేయడంపై 20 శాతం గట్టి నమ్మకాన్ని కలిగి ఉన్నట్లు పేర్కొన్నారు.

మొత్తానికి మహిళల కంటే పురుషులు 12 శాతం ఓవర్ కాన్ఫిడెన్స్‌తో ఉన్నట్లు ఈ విశ్లేషణలో తేలింది. దీనిపై అధ్యయన పరిశోధకులు మాట్లాడుతూ.. 'పురుషులు తమ జ్ఞానం, సామర్థ్యాలపై మహిళల కంటే ఎక్కువ నమ్మకాన్ని కలిగి ఉంటారు. రన్నింగ్ రేస్, డైవింగ్ లాంటి కఠిన పరిస్థితుల్లోనూ ఇదే మైండ్‌సెట్ ఫాలో అవుతారు. లింగ భేదాలకు సంబంధించిన టాస్క్‌లో వారి పని తీరును అంచనా వేయాల్సి వచ్చినప్పుడు ఈ అతి విశ్వాసం అంతరం మరింత ఎక్కువగా ఉంటుంది. కానీ స్త్రీలు మాత్రం ఇలా ఓవర్ కాన్ఫిడెన్స్ చూపించారు' అని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed