- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Megastar Chiranjeevi: సినీ కార్మికుల కోసం హాస్పిటల్ నిర్మించే యోచనలో చిరు
Megastar Chiranjeevi
దిశ, సినిమా : స్వయంకృషితో పైకొచ్చిన మెగాస్టార్ చిరంజీవి.. సినీ కార్మికులకు సహాయం అందించడంలో ఎప్పుడూ ముందుంటాడు. కొవిడ్ టైమ్‌లో ఎంతో మందిని ఆదుకున్న ఆయన.. ఇప్పుడు వారికోసం హాస్పిటల్ నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఫిల్మ్ నగర్/జూబ్లీహిల్స్ ప్రాంతంలో తగిన ప్రదేశం కోసం వెతుకుతుండగా.. సినీ కార్మికులకు ఈ ప్రాంతాలు సౌకర్యవంతంగా ఉంటాయా అని ఆలోచిస్తున్నాడు.
ఉచితంగా లేదా తక్కువ ఖర్చులతో వైద్య సేవలు అందించేందుకు ప్రయత్నిస్తున్న చిరు.. ఒక్కో రోజు ఒక్కో స్పెషలిస్ట్ హాస్పిటల్‌ను సందర్శించేలా చర్యలు తీసుకుంటారని టాక్. ఈ సేవలు సినిమా జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులకు కూడా అందనున్నాయి. గతంలో అభిమాని సుధాకర్ కంచర్లతో కలిసి జీవితకాలం 50% తగ్గింపుతో యోధా డయాగ్నోస్టిక్స్‌ను ప్రారంభించిన మెగాస్టార్.. సెకెండ్ వేవ్‌లో తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో వ్యక్తిగత ఖర్చుతో ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. చిరు టాలీవుడ్ ఫిల్మ్ జర్నలిస్టుల కోసం ఉద్దేశించిన సంక్షేమ కార్యక్రమాలకు కూడా ఆర్థిక సహాయం చేస్తున్నాడు.