Excess energy : శరీరంలో ఎనర్జీ అధికమైనా కష్టమే.. అప్పుడు జరిగే మార్పులివే..

by Javid Pasha |
Excess energy : శరీరంలో ఎనర్జీ అధికమైనా కష్టమే.. అప్పుడు జరిగే మార్పులివే..
X

దిశ, ఫీచర్స్ : మీరు ఏదైనా ఒక పనిచేయాలని అనుకున్నంత మాత్రాన సరిపోదు. మెంటల్లీ, ఫిజికల్లీ అందుకు సంసిద్ధంగా ఉండాలంటారు నిపుణులు. ముఖ్యంగా ఒక వర్క్ ఫర్ ఫెక్ట్‌గా చేయాలంటే బాడీకి ఎనర్జీ అవసరం. రెగ్యులర్ ఫంక్షనాలిటీతోపాటు ఏవైనా ప్రమాదాలు జరిగినప్పుడు, అనుకోని ఇబ్బందులు తలెత్తినప్పుడు, వ్యాధుల నుంచి కోలుకోవడానికి సాధారణ పరిస్థితులకు మించి అదనపు శక్తి (Excess energy) అవసరం అవుతుంది. అయితే కొన్నిసార్లు ఈ శక్తి ఓవర్ లోడ్ అయినా సమస్యగా మారుతుంది. కాబట్టి శరీరం ఎక్సెస్ ఎనర్జీని బయటకు పంపుతుంది. ఈ సందర్భంగానే బాడీలో ఇబ్బందికరమైన తాత్కాలిక అసౌకర్యం కలుగుతుంది. అయినప్పటికీ తర్వాత మాత్రం రిలాక్స్ అవుతామని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఎక్సెస్ ఎనర్జీ రిలీజ్ సమయంలో కనిపించే ముఖ్యమైన లక్షణాలేవో ఇప్పుడు చూద్దాం.

* కండరాల సంకోచం : కొన్నిసార్లు అనుకోకుండా కండరాలు మెలితిప్పినట్లు అనిపిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో కొందరికి మజిల్స్ వణకడం లేదా సంకోచించడం వంటివి కూడా జరగవచ్చు. అయితే ఈ కండరాల కదలికలు మనకు మేలు చేస్తాయి. ఎందుకంటే అదనపు ఎనర్జీని బయటకు వెళ్లేందుకు శరీరంలో బ్లాకేజీలను క్లియర్ చేస్తాయి. దీంతో శరీరంలో ఎనర్జీ బ్యాలెన్స్ రీస్టోర్ అవుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.

* సడెన్ ఎమోషన్స్ : పేరుకుపోయిన అదనపు శక్తిని శరీరం బయటకు వదిలే క్రమంలో మనలో ఆకస్మిక భావోద్వేగాలు కూడా సంభవిస్తుంటాయి. ఉదాహరణకు పరిస్థితిని, ప్రభావాన్ని బట్టి కోపం, నవ్వు, ఏడుపు వంటివి మనంలో వ్యక్తం కావచ్చు. అయితే ఇవన్నీ ఒక రకంగా మన ఆరోగ్యానికి మేలు చేస్తాయని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా స్ట్రెస్ రిలీఫ్ కలిగిస్తుంది. అందుకే చాలామంది ఏడ్చిన తర్వాతనో, నవ్విన తర్వాతనో చూస్తే రిలీఫ్‌గా కనిపిస్తుంటారు. శరీరంలో అవసరం లేని ఎక్సెస్ ఎనర్జీ బయటకు పోయి, అవసరం మేరకు రీ స్టోర్ అవడమే ఇందుకు కారణం.

* ఎనర్జీ రిలీజ్ ప్రాసెస్ : శరీరంలో పేరుకుపోయిన అధిక శక్తి బయటకు వెళ్లడం, అవసరమైన శక్తి రీస్టోర్ అవడం అనేది ఎప్పటికీ జరుగుతుందని కూడా చెప్పలేం. దానికి ప్రత్యేక పరిస్థితులు ఉంటాయి. ముఖ్యంగా చలికాలంలో శారీరక శ్రమ తగ్గడంవల్ల కూడా ఎక్కువ కష్టపడిన వ్యక్తిలా అలసిపోతుంటారు కొందరు. పైగా కీళ్లు, ఒళ్లు నొప్పులు కూడా సంభవిస్తాయి. అంటే మీ శరీరం నుంచి పేరుకుపోయిన పాత ఎనర్జీ బయటకు వెళ్లిపోతోందని ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అంటున్నారు నిపుణులు. ఇలాంటప్పుడు బాడీ ఒత్తిడికి గురై నొప్పికి గురికావడం, కళ్లు తిరగడం, తలనొప్పి రావడం వంటివి ఒక్కొక్కరిలో ఒక్కో లక్షణం కనిపించవచ్చు. కానీ పర్మినెంట్‌గా ఉండవు. తాత్కాలికంగా వచ్చిపోతుంటాయి. చలికి గురైనప్పుడు శరీరం వణకడం, వేడికి గురైనప్పుడు చెమటలు పట్టడం వంటి ప్రాసెస్ కూడా ఎక్సెస్ ఎనర్జీ (Excess energy) బయటకు వెళ్లే క్రమంలోనే జరుగుతుందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు.

* నోట్ : పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story