- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Diljit Dosanjhe: ‘ఇకపై మద్యంపై పాట పాడను’.. తెలంగాణ పోలీసుల నోటీసులకు దిల్జిత్ కౌంటర్
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రభుత్వ నోటీసులపై సింగర్ దిల్జిత్ షాకింగ్ కామెంట్స్ చేశారు. అహ్మదాబాద్ షో సందర్భంగా ఈ నోటీసులపై సెటైర్లు వేసిన దిల్జిత్.. గుజరాత్ డ్రై స్టేట్ కాబట్టి తాను అహ్మదాబాద్‌లో లిక్కర్‌పై పాటలు పాడనని అన్నాడు. అంతేకాకుండా దేశంలోని మిగిలిన రాష్ట్రాలను కూడా డ్రై స్టేట్‌లుగా ప్రకటించాలని డిమాండ్ చేసిన దిల్జిత్.. అలా ప్రకటిస్తే ఇకపై లిక్కర్‌పై ఒక్క పాట కూడా పాడనని అన్నాడు. అసలేం జరిగిందంటే.. ఈ నెల 15న హైదరాబాద్‌లో కాన్‌సర్ట్ సందర్భంగా లిక్కర్, డ్రగ్స్ వాడకాన్ని, హింసను ప్రోత్సహించేలా పాటలు పాడొద్దంటూ దిల్జిత్‌కు తెలంగాణ పోలీసులు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఈ నోటీసుల విషయాన్ని ఈ రోజు (సోమవారం) అహ్మదాబాద్‌లో కాన్‌సర్ట్ నిర్వహిస్తున్న సందర్భంలో ప్రస్తావించిన దిల్జిత్.. ‘ఈ రోజు ఓ గుడ్ న్యూస్. నాకు ఇక్కడ ఎలాంటి నోటీసులు రాలేదు. ఇంతకంటే పెద్ద గుడ్ న్యూస్ ఇంకొకటి ఉంది. విషయం ఇక్కడితో అయిపోలేదు. అదేంటంటే ఈ రోజు కూడా నేను మద్యంపై ఎలాంటి పాట పాడను. ఎందుకంటే గుజరాత్ డ్రై స్టేట్ కాబట్టి. కానీ బాలీవుడ్ నటులు లిక్కర్‌పై యాడ్స్ కూడా చేస్తారు. నేను మాత్రం చేయను. నన్ను రెచ్చగొట్టొద్దు. నేను ఎక్కడకు వెళ్లినా సైలెంట్‌గా నా ప్రోగ్రాం చేసుకుని వెళ్లిపోతాను. నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు. ఓ పని చేద్దాం. మనందరం ఓ ఉద్యమం చేద్దాం. ఇంతమంది ఉన్నప్పుడు ఉద్యమం చేయొచ్చు. ఒకవేళ మన దేశంలోని అన్ని రాష్ట్రాలు మద్యాన్ని నిషేధిస్తే.. ఆ మరుసటి రోజు నుంచే నేను మద్యంపై పాట పాడడం మానేస్తాను’ అన్నాడు. దీంతో దిల్జీత్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.