- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
లీకేజీ గుంతలు పూడ్చేదెన్నడు..??
దిశ, మంగపేట : మండల కేంద్రంలోని డ్రింకింగ్ వాటర్ మెయిన్ లైన్ పైపుల లీకేజీల రిపేర్ల కోసం రెండు నెలల క్రితం గుంతలు తీసిన పంచాయతీ సిబ్బంది నేటికీ రిపేర్లు చేయకుండా గుంతలు పూడ్చకపోవడంతో నల్లాల్లో మురికినీరు ప్రవహించి రోగాల బారిన పడుతున్నామని టీచర్స్ కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. ఓవర్ హెడ్ ట్యాంకు నుండి రెవిన్యూ, ఎంపీడీవో కార్యాలయాల మీదుగా ప్రధాన రహదారి వెంట గంపోనిగూడెం వైపు పోయిన పైపు లైన్లు అక్కడక్కడా లీకేజీలై తాగునీరు వృథా అవుతుండడంతో పంచాయతీ సిబ్బంది రెండు నెలల క్రితం గుంతలు తీసి వదిలేశారని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. దీంతో గుంతల్లో నీరు నిండి అదే నీరు నల్లాల్లో ప్రవహిస్తూ బురద నీరు వస్తున్నాయని, ఎన్ని సార్లు అధికారుల దృష్టికి తెచ్చినా పట్టించుకోవడంలేదని, వెంటనే లీకేజీలు రిపేర్లు చేసి గుంతలు పూడ్చాలని కోరుతున్నారు. ఈ విషయం పై పంచాయతీ కార్యదర్శి సురేష్ వివరణ కోరగా 25 సంవత్సరాల క్రితం వేసిన సిమెంట్ పైపులైను లోకి రోడ్డు వెంట నాటిన చెట్లు భారీ వృక్షాలై వాటి వేర్లు పైపులోకి వెళ్లడంతో రహదారిపై పైపులు పగిలి తాగునీరు వృథా అవుతుందని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గుంతలు తీసి రిపేర్లు చేసే వీలు కాక గుంతలు పూడ్చకుండా ఆపినట్టు తెలిపారు. భారీ చెట్ల వేర్లు కట్ చేయడం వల్ల చెట్లు నేలకూలే అవకాశాలున్నందున అధికారుల ఆదేశాల కోసం చూస్తున్నట్లు తెలిపారు.