- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పంచాయతి కార్యదర్శిగా రిజైన్ చేసిన ట్రాన్స్‌ఉమన్.. ఆ తర్వాత మళ్లీ అదే పదవికి..
దిశ, ఫీచర్స్ : తమిళనాడు, తిరువళ్లూరు జిల్లాకు చెందిన చందన్‌రాజ్ 2010లో పంచాయతీ కార్యదర్శి ఉద్యోగం సంపాదించాడు. కానీ లైంగిక గుర్తింపు కారణంగా మానసిక క్షోభ అనుభవిస్తూ ఉద్యోగానికి రాజీనామా చేశాడు. కట్ చేస్తే.. ఇప్పుడు మహిళగా మారిన చందన్‌రాజ్ 12 ఏళ్ల తర్వాత మళ్లీ అదే ఉద్యోగంలో నియమితమై, రాష్ట్రంలోనే ఈ పదవి చేపట్టిన మొట్టమొదటి ట్రాన్స్‌ఉమన్‌గా చరిత్ర సృష్టించింది. టీనేజ్ నుంచే తన శరీరంలో వస్తున్న మార్పులను, సంఘర్షణను గమనించిన చందన్‌రాజ్.. ఎవరికీ చెప్పుకోలేక సతమతమయ్యేవాడు.
వారం రోజుల పాటు అబ్బాయిగా జీవించినా, వారాంతాల్లో తన మనసుకు నచ్చినట్లుగా చీర కట్టుకుని ఆ రోజంతా సంతోషంగా గడిపేవాడు. అయితే ఏనాడూ చదువును నిర్లక్ష్యం చేయని తను డిప్లొమా కంప్లీట్ చేసి 2010లో పంచాయితీ కార్యదర్శి ఉద్యోగం పొందాడు. కానీ తన ఆలోచనలు క్రమక్రమంగా మారిపోతుండటంతో మానసిక క్షోభను తట్టుకోలేక ఉద్యోగం, కుటుంబాన్ని వదిలేసి 2015లో ముంబైకి, ఆ తర్వాత నేపాల్‌కు వెళ్లాడు. కొన్నిరోజులకు తిరిగొచ్చి పౌరోహిత్యం సహా అనేక చిన్నాచితక ఉద్యోగాలు చేశాడు.
ఈ క్రమంలోనే 2016లో కిల్‌పాక్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో సెక్స్-చేంజ్ సర్జరీ చేసుకుని దాక్షాయణిగా మారిపోయాడు. అయితే 2020లో ఆమెను గుర్తించిన ఒక ఫ్యామిలీ ఫ్రెండ్.. కుటుంబంతో కనెక్ట్ చేశాడు. అప్పటికే వాళ్ల నాన్న చనిపోగా.. ఐదేళ్ల తర్వాత ఇంటికి వచ్చిన దాక్షాయణికి వాళ్ల అమ్మ మద్దతుగా నిలవడంతో ఉద్యోగానికి మళ్లీ దరఖాస్తు చేసుకుంది. చాలా కాలంగా పనికి దూరంగా ఉన్న తనను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వానికి లేఖ రాయగా.. కారుణ్య కారణాలతో ఆమెను ఇటీవలే విధుల్లోకి తీసుకున్నారు.